twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    129 సార్లు రక్తదానం.. అభిమానిని అభినందించిన చిరంజీవి!

    |

    గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకులో జరిగిన కార్యక్రమాల్లో మెగాస్టార్ చిరంజీవి పాలుపంచుకొన్నారు. ఈ వేడుకల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్టు చైర్మన్‌గా మెగాస్టార్ డాక్టర్ కే చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై గణతంత్ర దినోత్సవ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అని రక్తనేత్రదాన కేంద్రం నిర్వాహకులు స్వామినాయుడు తెలిపారు.

    చిరంజీవి జెండా వందనం సమర్పించిన తర్వాత రక్తదాన కార్యక్రమాలు జరిగాయి. సుమారు 225 మంది అభిమానులు, జనసైనికులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన రక్తదాతలందరితో మెగాస్టార్ కరచాళం చేశారు.
    అత్యధికంగా 129 సార్లు రక్తదానం చేసిన శ్రీ సంపత్ కుమార్‌ని, 35 సార్లు రక్తదానం చేసిన శ్రీ రాఘవ చార్యులని ప్రత్యేకంగా అభినందించారు.

    Mega Star Chiranjeevi attended for Republic Day celebrations
    Mega Star Chiranjeevi attended for Republic Day celebrations

    ఈ కార్యక్రమంలో తెలంగాణా, ఆంధ్రా నుంచి వచ్చిన అనేక మంది జనసైనికులు హాజరయ్యారు. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఆంధ్రా, తెలంగాణా, కర్నాటక, మహారాష్ట్ర, ఓరిస్సా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుండి వచ్చిన వందలాది మంది పాల్గొని జయప్రదం చేశారు అని స్వామినాయుడు వెల్లడించారు.

    English summary
    Mega Star Chiranjeevi attended for Republic Day celebrations. He participated his Blood Bank premises. After Republic day celebration, nearly 225 Fans are donated blood. Chiranjeevi appreciated his fans for donating the blood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X