విలన్‌కి చిరంజీవి విలాసవంతమైన కారు గిఫ్ట్.. అతడెవరు, ఎందుకో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన నటనతో పాటు క్యారెక్టర్ గురించి కూడా అందరికీ తెలిసిందే. తెలుగు సినీ ప్రియులు ఎంతగానో ఇష్టపడే ఈయనను చూసి చాలా మంది సినిమాల్లోకి వచ్చారు. అయితే ఈయన టాలీవుడ్ కు చెందిన చాలా మందికి సాయం చేశాడు. అలాగే ఎవరైనా బాగా నటిస్తే వారికి కూడా గిప్టులు ఇచ్చారు. అలా చాలా సార్లే వార్తల్లో నిలిచారు. కానీ తొలిసారి రేప్ లు చేసే వ్యక్తికి కారు కొనిచ్చారు. అయితే ఆ రేప్ లు చేసే వ్యక్తి ఎవరు, అసలు అతడికి చిరంజీవి కారు ఎందుకు కొనిచ్చాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నటుడు సత్య ప్రకాష్... తెలుగులో అనేక సినిమాల్లో విలన్ గా చేశాడు. అలా చాలా మంది అమ్మాయిలను రేప్ చేశాడు. రేపిస్ట్ గా నటించడంలో ఈయనను మించిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. సత్య ప్రకాశ్ మొత్తం 11 భాషల్లో సుమారు 500కి పైగా సినిమాల్లో నటించాడు. అందులోనూ చాలా సినిమాల్లో రేపిస్ట్ గా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేశాడు. విలన్ అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే నటించాలని అనే స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈయనకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఈ మధ్య ఎక్కువగా ఈయన కనిపించకపోయినప్పటికీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

Mega Star Chiranjeevi Bought A Car For Actor Satya Prakash Check Details

అయితే ఆయ తెలుగులోకి వచ్చిన తొలి నాళ్లలో మెగాస్టార్ చిరంజీవికి.. ఆయనను సౌందర్యనే పరిచయం చేసిందట. అయితే పక్కనే సౌందర్య, చిరంజీవిల సినిమా షూటింగ్ జరగుతుండగా.. ఓసారి కలిసేందుకు వెళ్లాడట. వెంటనే సౌందర్య చూసి ఆప్యాయంగా మాట్లాడి ఆపై చిరంజీవికి పరిచయం చేస్తానని తీసుకెళ్లారట. తాను చేసిన సినిమాల్లో ఒకే ఒక్క సారి రేప్ కు గురయ్యానని.. అలా ఒక్కసారి రేప్ చేసింది మరెవరో కాదు ఈ దుర్మార్గుడే అని చెప్పిందట. దానికి చిరంజీవి కూడా నవ్వారట. అలా తామిద్దరి మధ్య తొలి పరిచయం ఏర్పడగా.. ఆ తర్వాత అనేక సినిమాల్లో కలిసి నటించినట్లు వివరించాడు.

ముఖ్యంగా అన్నయ్య సినిమాలో తామిద్దరూ కలిసి నటించేటప్పుడు చిరంజీవి గారు తనను బాగా అబ్జర్వ్ చేశారని అన్నాడు. ఓరోజు ఫైట్ సీన్ అయిపోయి రాత్రి ఇంటికి వెళ్తుంటే తనను ఆయన చూశారని.. ఆ తర్వాతి రోజు ఉదయమే పిలిచి నువ్వెలా వెళ్తావని అడిగారట. స్కూటర్ పై వెళ్తుంటాను సార్ అని చెబితే హెల్మెట్ పెట్టుకుంటావా అని అడిగితే లేదని చెప్పాడట. నువ్వు చాలా పెద్ద నటుడివి అవుతావు.. నీ అవసరం మీ ఫ్యామిలీతో పాటు ఈ ఇండస్ట్రీకి కూడా ఉంది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారట. అలాగే ఇకపై నువ్వు రేపటి నుంచి స్కూటర్ లో వచ్చేందుకు వీలు లేదని.. అన్నారట.

Mega Star Chiranjeevi Bought A Car For Actor Satya Prakash Check Details

అదేంటి సార్ అని సత్య ప్రకాష్ అడగ్గా.. అవును ఈరోజు నుంచి నువ్వు ఈ కారులో రా అంటూ ఓ కారును గిఫ్టుగా ఇచ్చారట. అలా తన తొలి కారు చిరంజీవి ఇచ్చింది కావడం తన అదృష్టం అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తాను ఎన్ని కార్లు కొనుక్కున్నా.. మెగాస్టార్ ఇచ్చిన కారు వచ్చినప్పుడు కల్గిన ఫీలింగ్ కల్గదేని.. అది తనకెప్పుడూ చాలా స్పెషల్ యే అని పేర్కొన్నారు. ఇలా రేప్ లు చేసే తనకు మెగాస్టార్ కార్ కొనివ్వడం జరిగిందంటూ చాలా గట్టిగా చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X