"Mega 156" Movie: మ్యూజిక్ సిట్టింగ్స్ తో Mega156 ప్రారంభం - ఓల్డ్ ఈస్ గోల్డ్ అంటే ఇదే!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్న 156వ సినిమా గురించి అందరికీ తెలిసిందే. బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ట సెకండ్ సినిమా ద్వారా మెగా స్టార్ చిరును డైరెక్ట్ చేస్తున్నారు. యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ కూడా పాల్గొన్నారు. అలాగే దర్శక, నిర్మాతలు కూడా పూజలో పాల్గొన్నారు.
చిరంజీవి, సురేఖ దంపతుల చేతుల మీదుగా.. డైరెక్టర్ వశిష్ఠకు మెగా156 చిత్రానికి సంబంధించిన స్క్రిప్టును అందజేశారు. అలాగే అల్లు అరవింద్ కమెరా స్విచ్ ఆన్ చేయగా.. ది గ్రేట్ లెజండరీ డైరెక్టర్ కె. రాఘవేంద్ర రావు క్లాప్ ఇచ్చారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఇతర డైరెక్టర్లు వీవీ వినాయక్, మారుతిలు కూడా పాల్గొన్నారు. అయితే సినిమాకు కొబ్బరి కాయ కొట్టిన తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించడం అనేది టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ. అయితే ఈ పద్ధతిని చాలా కాలం నుంచే ఎవరూ పాటించట్లేదు.

కానీ తాజాగా చిరంజీవి తన 156వ చిత్రానికి మ్యూజిక్ సిట్టింగ్ పద్ధతిని మళ్లీ తీసుకొచ్చారు. ఈ విషయాన్ని యువీ క్రియేషన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేసి.. పాత కాలంలో సినిమాలు సంగీతం కంపోజ్ చేయడంతో ప్రారంభం అయ్యేవని... MEGA156 సినిమా తిరిగి ఆ సంప్రదాయాన్ని మళ్లీ తీసుకు వచ్చిందని వివరించారు. బ్రహ్మాండమైన పూజా కార్యక్రమాల తర్వాత.. పాటల కూర్పుతో వేడకను ప్రారంభించినట్లు వెల్లడించారు. అలాగే అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ట్విట్టర్ వేదికగా యువీ క్రియేషన్స్ షేర్ చేసిన ఈ పోస్టులో.. ఆస్కార్ పురస్కార గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవారణి, గేయ రచయిత చంద్రబోస్, దర్శకుడు వశిష్ఠ, చిరంజీవిలు కూర్చొని కనిపించారు. వీరందరి సమక్షంలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టారు. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని సంగీత దర్శకుడు కీరవాణి తెలిపారు. పూజ తర్వాత సాంగ్స్ రికార్డ్ చేయడమనే పద్ధతిని మళ్లీ ఈ సినిమాతో తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. సెలబ్రేషన్ సాంగ్ రికార్డు చేస్తున్నామని పేర్కొన్నారు.
అలాగే చంద్రబోస్ మాట్లాడుతూ... అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆపై అత్యంత అరుదైన ఈ చిత్రంలో భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని వివరించారు. మనస్ఫూర్తిగా కీరవాణికి, దర్శకుడికి టీం అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. దసరా సందర్భంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం, సినిమా ప్రారంభించడంతో.. మెగా అభిమానులు అంతా తెగ సంతోషంగా ఫీలవుతున్నారు. కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











