సుస్మిత కొణిదెల బర్త్ డే: మెగా డాటర్‌కు చిరంజీవి ఎమోషనల్ సందేశం

మెగాస్టార్ చిరంజీవి కూతురు, నిర్మాత సుస్మిత కొణిదెల తన జన్మదినాన్ని జరుపుకొంటున్నారు. ఇటీవల కాలంలో సంచలన విజయాలు సాధిస్తున్న ఈ యువ నిర్మాతకు సినీ వర్గాలు, మెగా అభిమానులు శుభాకాంక్షలు అందిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని కొరుకొంటున్నారు. అయితే సుస్మిత బర్త్ డే సందర్బంగా చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన కూతురిపై ఉన్న కొండంత ప్రేమకు ఆక్షర రూపం ఇచ్చారు. మెగా డాటర్‌కు ఆయన ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ అందిస్తూ భావోద్వేగమైన సందేశాన్ని అందించారు. సుస్మితకు చిరంజీవి అందించిన బర్త్ డే సందేశం వివరాల్లోకి వెళితే..

మెగాస్టార్ ట్వీట్ చేస్తూ.. నా అమూల్యమైన కూతురు సుస్మిత కొణిదెలకు హ్యాపీ బర్త్ డే. చిన్నారిగా నా చేతి వేలును పట్టుకొని బుడిబుడి అడుగులు వేస్తూ పెరిగిన అమ్మాయి.. ఈ రోజు స్ట్రాంగ్, గ్రేస్‌ఫుల్, బాధ్యతాయుతమైన మహిళగా ఎదిగడం నాకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తుంది అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Mega Star Chiranjeevi Emotional Birthday wishes for Daughter Sushmita Konidela

తండ్రిగా నా సినిమాలను చూస్తూ పెరిగిన అమ్మాయి.. ఇప్పుడు నా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తే స్థాయికి రావడం. నాకు మరిచిపోలేనటువంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించడం నాకు స్పెషల్ మూమెంట్స్ నిలిచింది. తండ్రిగా నాకు ఈ మూమెంట్ అత్యంత గర్వపడే విషయమని చెప్పుకొంటాను. నా జీవితంలో ఇది ప్రత్యేకం అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

సుస్మిత చేపట్టే ప్రతీ పనిలో గొప్ప విజయాలు సాధించాలి. మంచి ఆరోగ్యం, ఎనలేని సంతోషాలు ఆమె జీవితంలో కలుగాలిని కోరుకొంటున్నాను. హానీ పాప.. విజయాల పరంపర కొనసాగించాలి. నీకు ప్రేమానురాగాలతో కూడిన నా దీవెనలు ఎప్పుడూ నీకు ఉంటాయి అని చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు.

సుస్మిత కొణిదెల కెరీర్ విషయానికి వస్తే.. మెగా డాటర్ ట్యాగ్‌తో ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొంటున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా మారారు. వెబ్ సిరీస్, చిన్న సినిమాలతో ప్రయాణం మొదలుపెట్టిన సుస్మిత తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించి భారీ విజయాన్ని అందుకొన్నారు. మహిళ నిర్మాతగా ఎనలేని పాపులారిటీని సంపాదించుకొంటున్నారు. తెలుగు సినిమా ప్రపంచంలో మరిన్ని విజయాలు సాధించాలి. మెగా అభిమానులే కాకుండా భారతీయ సినీ అభిమానలంతా గర్వపడేలా సినిమాలు నిర్మించాలని తెలుగు ఫిల్మీబీట్ కోరుకొంటుంది. ఆల్ ది బెస్ట్.. హ్యాపీ బర్త్ డే సుస్మిత కొణిదెల గారు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X