30 ఏళ్ల తర్వాత రివర్స్ సీన్... పవన్‌పై చిరంజీవి ఎమోషనల్ కామెంట్!

Chiranjeevi-Pawan Kalyan: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ క్రేజ్ మరోసారి తారాస్థాయికి చేరుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా 'మెగా 158' గురువారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం సినీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ భారీ ఉత్సాహాన్ని నింపింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టడం ఈ ఈవెంట్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచింది.\

మెగా బ్రదర్ నాగబాబు కూడా పాల్గొనడంతో మెగా బ్రదర్స్ ఒకే వేదికపై కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరవుతారని ముందుగా ప్రకటించినప్పటికీ, ఈ కార్యక్రమానికి ఆయన రాలేకపోవడం అభిమానుల్లో కొంత నిరాశ కలిగించింది. ఈ ఈవెంట్ తరువాత చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

Mega star Chiranjeevi Emotional tweet Pawan Kalyan Claps for Mega158 After 30 Years

ఈ కార్యక్రమంలో కనిపించిన మెగా బాండింగ్ అందరినీ ఆకట్టుకుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే కారులో రావడం, నాగబాబుతో కలిసి సరదాగా ముచ్చటించడం వంటి క్షణాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "ఇదే అసలు మెగా ఫ్యామిలీ" అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ భావోద్వేగ క్షణాలు ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ లాంచ్ అనంతరం చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

'ఈ రోజు కళ్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే 30 సంవత్సరాల క్రితం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సమయంలో ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది' అంటూ ఆయన పేర్కొన్నారు. అప్పట్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీకి అన్నగా తాను క్లాప్ కొట్టగా, ఇప్పుడు దాదాపు 30 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ తన సినిమా ముహూర్తానికి క్లాప్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. 'డిప్యూటీ సీఎం హోదాలో టైమ్ తీసుకుని వచ్చి క్లాప్ ఇచ్చినందుకు థాంక్యూ... లవ్ యూ కళ్యాణ్' అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు.

ఈ ఎమోషనల్ ట్వీట్ మెగా అభిమానులను కదిలించింది. 'అన్నదమ్ముల బాండింగ్‌కు ఇదే నిదర్శనం" అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు "ఆనాటి రామలక్ష్మణులు ఎలా ఉంటారో చూడలేకపోయాం... ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం" అంటూ భావోద్వేగంగా స్పందిస్తున్నారు. చిరంజీవిపై పవన్ కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా, మెగా డాటర్ సుస్మిత కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సీనియర్ దర్శకులు ఏ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్ కలిసి స్క్రిప్ట్‌ను దర్శకుడు బాబీకి అందించారు. ఈ వేడుకకు అల్లు అరవింద్, దిల్ రాజు, బండ్ల గణేష్, మెహర్ రమేష్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.

'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో 'మెగా 158'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి కూడా మాస్ ఎంటర్‌టైనర్‌గా, హై వోల్టేజ్ యాక్షన్‌తో పాటు ఎమోషన్ మిక్స్ చేసిన కథతో సినిమా రాబోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని విజయ్ కార్తీక్ కన్నన్ నిర్వహిస్తున్నారు. మలయాళ నటి అనశ్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ అయింది.

'మెగా 158' లాంచ్ కేవలం సినిమా ప్రారంభం మాత్రమే కాదు.. మెగా ఫ్యాన్స్‌కు ఒక ఎమోషనల్ సెలబ్రేషన్‌గా మారింది. 30 ఏళ్ల జ్ఞాపకాన్ని తిరిగి గుర్తు చేస్తూ జరిగిన ఈ మెగా మోమెంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, రాబోయే రోజుల్లో ఈ సినిమా నుంచి మరిన్ని సర్ప్రైజ్‌లు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X