కూతురి జ్ఞాపకాలతో చిరంజీవి మాజీ అల్లుడు ఎమోషనల్ .. త్వరగా వచ్చేయ్ అంటూ కంటతడి
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మాజీ భర్త కళ్యాణ్ దేవ్ కూతురి కోసం తపించిపోతున్నారు. ప్రస్తుతం తల్లి వద్దే ఉంటున్న చిన్నారి అప్పుడప్పుడు తండ్రి వద్దకు వస్తుంటుంది. ఈ క్రమంలో బాలల దినోత్సవం సందర్భంగా కూతురిని తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు కళ్యాణ్ దేవ్. ఈ వివరాల్లోకి వెళితే..
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తొలుత శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వీరి ప్రేమ వ్యవహారం సంచలనం సృష్టించింది. సరిగ్గా చిరు పొలిటికల్ ఎంట్రీకి ముందు జరిగిన ఈ గొడవ మెగా ఫ్యామిలీని, చిరంజీవి అభిమానులను మానసికంగా కృంగదీసింది. వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చి మెగా ఫ్యామిలీ నుంచి తమకు ప్రాణహాని ఉందని చెప్పడం సంచలనం కలిగించింది. ఈ వ్యవహారంపై చిరంజీవి మౌనంగానే ఉండిపోగా.. పవన్ కళ్యాణ్ మాత్రం మీడియా ముందుకు వచ్చి తన దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉందని చూపించడం దుమారం రేపింది.

2014లో శ్రీజ- శిరీష్ దంపతులకు ఒక బిడ్డ పుట్టింది. ఈ క్రమంలో తనను శిరీష్ వేధిస్తున్నాడని, అదనపు కట్నం కోసం చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ శ్రీజ ఆరోపించడం అంతే వివాదాస్పదమైంది. మనస్పర్ధల నేపథ్యంలో శిరీష్‌కు శ్రీజ విడాకులు ఇచ్చి తిరిగి పుట్టింటికి చేరుకున్నారు. ఇటీవల అనారోగ్య కారణాలతో శిరీష్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక 2016లో వ్యాపారవేత్త కళ్యాణ్‌దేవ్‌ను శ్రీజ రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె నవిష్క జన్మించింది. కానీ దురదృష్టవశాత్తూ మరోసారి శ్రీజ వైవాహిక జీవితం కుదుపులకు లోనైంది. గతేడాది కళ్యాణ్ దేవ్ - శ్రీజ జంట విడిపోయింది
శ్రీజ - కళ్యాణ్ దేవ్‌లు విడిపోవడానికి ఫలానా కారణమంటూ ప్రత్యేకంగా తెలియరాలేదు. కానీ మీడియాలో మాత్రం రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. భార్య నుంచి విడాకులు తీసుకున్నా కూతురు నవిష్క కోసం కళ్యాణ్ దేవ్ ఎప్పుడూ పరితపిస్తూనే ఉంటారు. ఈ చిన్నారి అంటే ఆయనకు పంచ ప్రాణాలు. తరచు కూతురిని మిస్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు.
కొద్దిరోజుల క్రితం తన పుట్టినరోజు వేడుకలకు వచ్చిన నవిష్కని చూసుకుని కళ్యాణ్ దేవ్ మురిసిపోయాడు. నువ్వు రావడంతో నా బర్త్ డే స్పెషల్‌గా మారిందని ఇన్‌స్టాలో పోస్టులు పెట్టాడు. తిరిగి నవిష్క తన తల్లి దగ్గరగా వెళ్లడంతో పాప ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు కళ్యాణ్ దేవ్. తాజాగా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మరోసారి కూతురిపై ప్రేమను చాటుకున్నారు కళ్యాణ్ . ఆమెతో గడిపిన పాత వీడియోను షేర్ చేశారు. అందులో చిన్నారి రెయిన్ బో స్కెచ్ వేయగా.. దానిని చూసి మురిసిపోయిన ఆయన కూతురిని ముద్దాడారు. ఈ వీడియోకు నేను నిన్ను పట్టుకున్నప్పుడే జీవితం అంటే ఏంటో అర్ధమవుతుందని పోస్ట్ పెట్టాడు. దీనికి మిస్ యూ సో మచ్, కమ్ బ్యాక్ సూన్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాడు . ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











