‘చిరంజీవిని తిట్టిన వాళ్లు అలా నాశనం.. ఇండస్ట్రీలో లేకుండా పోయారు’

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ప్రమేయం లేకుండానే వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. గద్దర్ అవార్డులు 2026 కార్యక్రమం సందర్భంగా చిరంజీవి చేసిన కామెంట్స్‌పై కొందరు తీవ్రంగా స్పందించారు. అయితే ఏపీలోని కొందరు నేతలు, టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనను కొందరు టార్గెట్ చేసుకొని కామెంట్స్ చేశారు. అయితే చిరంజీవి మాత్రం తన వంతుగా ఎలాంటి స్పందన లేకుండా వారి విజ్దతకే వదిలి వేశారు. అయితే చిరంజీవిపై కొందరు చేసిన కామెంట్స్‌పై దర్శకుడు వీవీ వినాయక్ స్పందించారు. ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేసి మద్దతుగా నిలిచారు. 99 టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడుతూ వినాయక్ చేసిన కామెంట్స్ వివరాల్లోకి వెళితే..

గద్దర్ అవార్డుల సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు ఇలాంటి అవార్డులు ఇవ్వడం స్వాగతిస్తున్నాను. పక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి అవార్డులు ఇవ్వాలి. నంది అవార్డులను మళ్లీ పునరుద్దరించాలి. దాంతో ఇండస్ట్రీకి ప్రోత్సాహం, ఉత్సాహం కలుగుతుంది అని చిరంజీవి అన్నారు. దాంతో ఆయన మాటలను వివాదంగా మలిచారు.

VV Vinayak on Chiranjeevi

అయితే చిరంజీవిని కొందరు టీడీపీ నేతలు తప్పుపట్టడంతో జనసేన నేతలు కూడా ఘాటుగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వానికి సూచన, సలహా చేశారు. అంతేకానీ ఆయన ఎలాటి విమర్శ చేయలేదు. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ధర్మాన్ని గౌరవించి మేము ఎదురు దాడి చేయడం లేదని జనసేన నేత గాదె తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో వినాయక్ చేసిన కామెంట్స్ కూడా భారీ చర్చకు దారి తీశాయి.

చిరంజీవి గారి గురించి అలా మాట్లాడితే బాధేస్తుంది. కానీ మేము ఏదైనా మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుందని ఊరుకొంటాం. ఒకవేళ మేము ఏదైనా మాట్లాడితే.. అలా ఎందుకు మాట్లాడారు? అంటూ మమ్మల్నే ఆయన తిడుతారు. ఆయన వ్యక్తిత్వం అలాంటింది. అలాంటి వ్యక్తిని టార్గెట్ చేసుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడుతారు అని వీవీ వినాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.

గద్దర్ అవార్డుల వేదికపై చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో తప్పులేదు. ఆయన మాట్లాడిన మాటల్లో తప్పు ఏముంది? ఒకప్పుడు తెలుగు రాష్ట్రంలో అంగరంగ వైభవంగా నంది అవార్డులు పండుగ జరిగేది. ప్రతీ ఉగాది పండుగ రోజున సాయంత్రం అందరూ టెలివిజన్ల ముందు కూర్చని వేడుకను చూసే వారు. పండుగ అంతా అక్కడే జరిగిందనే ఫీలింగ్ కలిగేది. ఇండస్ట్రీలో అలాంటి వాతావరణాన్ని చూడాలని కోరుకోవడం ఆయన గురించి కాదు. ఇండస్ట్రీ గురించి కదా. అందరూ ఆనందపడుతారనే ఉద్దేశంతో ఆయన అంటే తప్పు పడితే ఎలా అని వినాయక్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

గత కొన్నేళ్ల నుంచి చూస్తే.. చిరంజీవి గారిని ఎవరైనా ఏదైనా కామెంట్ చేసినా.. తిట్టినా వారు ఏదో రకంగా పాడైపోతారు. కొన్ని వందల ఉదాహరణాలు తీసుకో. ఆయన అనవసరంగా కామెంట్ చేసిన వాళ్లు ఎలా నష్టపోయారో చూశాం. ఓ మంచి వ్యక్తి మీద కామెంట్ చేయకూడదు. అలాంటి నిజాయితీతో కూడిన వ్యక్తి మీద కామెంట్ చేసిన వారు ఇప్పుడు ఇండస్ట్రీలో కనిపించడం లేదు. ఏదో రకంగా పాడయ్యారు. ఆయన స్టేటస్ ఏంటి? ఆయన శక్తి ఏమిటో చూసుకోండి. కానిస్టేబుల్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఆయన అభిమానులే ఉన్నారు అని వినాయక్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X