Hanuman Movie: హనుమాన్‌లో ఆంజనేయ స్వామిగా మెగాస్టార్ చిరంజీవి.. డైరెక్టర్ ఏమంటున్నారంటే?
బాలనటుడిగా కెరియర్ ప్రారంభించి పాతిక సినిమాలకు పైగా చిత్రాల్లో చేసిన చిచ్చర పిడుగు తేజ సజ్జ గురించి అందరికీ తెలిసిందే. ఆ చిన్నప్పపటి బాల నటుడే హీరోగా మారి అద్భుతమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరో హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు.
ఈ సినిమాలో తేజ సజ్జాతో పాటు అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీనులు కూడా ఈ సినిమాలో కనిపించి సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్ షాకింగ్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆంజనేయ స్వామిగా మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంలో చిరును చూడబోతున్నారంటూ చాలా మంది చెబుతున్నారు.

అయితే ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ లో హనుమంతుడి పాత్రను గ్రాఫిక్స్ రూపంలో చూపించారు. అలాగే కేవలం హనుమంతుడి కళ్లను మాత్రమే హైలెట్ చేస్తూ ట్రైలర్ ద్వారా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్నింటినీ సీక్రెట్ గా ఉంచుతూ వస్తున్న సువర్చల దేవిని ఎలా చూపించబోతున్నారో కూడా చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆంజనేయ స్వామి కళ్లు చూస్తుంటే... అవి చిరంజీవి కళ్లేనని తెలుస్తోంది. ఇదే విషయాన్ని చాలా మంది డైరెక్ట్ గా డైరెక్టర్ ప్రశాంత్ వర్మను అడగ్గా.. అవునని, కాదని చెప్పకుండా సీక్రెట్, సప్సెన్స్ అంటూ మాట దాటవేశారు. ఆయన మాటలు, ఆంజనేయ స్వామి కళ్లు చూస్తుంటే ఈ సినిమాలో మెగాస్టార్ ఉండబోతున్నాని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
విజ్యువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివేంద్ర సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా.. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ లు సంగీతం అందిస్తున్నారు. అలాగే ఎస్. బి రాజు తలారి ఎడిటర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం మూడు పాటలు ఉండగా.. అందులో ఒకటి హనుమాన్ చాలీసా, సూపర్ హీరో హనుమాన్, ఆవకాయ అంజనేయ పాటలు అందరినీ అలరించనున్నాయి.
ఇప్పటికే యూ/ఏ సర్టిఫికేట్ అందుకు ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ఎగ్జైట్ అవుతున్నారు. సినిమాలో చాలా థ్రిల్లింగ్ అండ్ సర్ ప్రైజ్ లు కూడా ఉండబోతున్నాయని డైరెక్టర్ అంటున్నారు. దీంతో మరింత బజ్ క్రియేట్ అవుతుంది. జనవరి 12వ తేదీన తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











