Hanuman Jayanti: చిరంజీవి ఇంట్లో హనుమాన్ అద్బుత లీల.. మెగాస్టార్ ఎమోషనల్ వీడియో

హనుమాన్ జయంతి పర్వదినాన్ని భారతీయులు ఘనంగా జరుపుకుంటున్నారు. శ్రీరామభక్తుడైన ఆంజనేయుని ఆరాధిస్తే అన్ని వ్యాధులు, పీడలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఎంతోమందికి ఆంజనేయుడు ఇష్టదైవం. ఎలాంటి కష్టంలోనైనా హనుమంతుడు తమకు అండగా ఉంటాడని భక్తులు భావిస్తున్నారు. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు కూడా ఆంజనేయస్వామికి భక్తులే. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి హనుమంతుడు ఇష్టదైవం అన్న సంగతి అందరికీ తెలిసిందే. హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన ఇంట్లో అద్భుతంగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను చిరంజీవి స్వయంగా పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

చిన్నప్పటి నుంచి చిరంజీవి.. హనుమంతుడికి పరమభక్తుడు. శివ శంకర వరప్రసాద్‌గా ఉన్న తన పేరుని మార్చుకోమని దర్శక నిర్మాతలు చెప్పినప్పుడు ఆంజనేయుని పేరు కలిసొచ్చేలా చిరంజీవి అని తన స్క్రీన్ నేమ్‌ని పెట్టుకున్నారు. అలాగే సందర్భం వచ్చినప్పుడల్లా ఆంజనేయుడిపై తన భక్తిని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెలియజేస్తుంటారు. తను స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌ లోగోలోనూ హనుమంతుడి రూపాన్ని డిజైన్ చేయించడంతో పాటు ఇంట్లో ఏకంగా ఆయనకి గుడి కట్టుకున్నారు. తాను ఈ స్థాయికి రావడానికి ఆంజనేయస్వామి ఆశీస్సులే కారణమని చిరంజీవి ఎన్నో సందర్భాల్లో చెప్పారు.

Mega Star Chiranjeevi Shares Divine Hanuman Miracle at Home on Hanuman Jayanti

తనలోని క్రమశిక్షణకు, కష్టపడేతత్వానికి ఆంజనేయుడే కారణం. ఆయనపై నాకున్న భక్తి, ప్రేమే నన్ను నడిపిస్తుంది. మనం ఆయనకి సరెండ్ అయిపోతే ఆంజనేయుడు ఎలా ముందుకు తీసుకెళ్తాడనే దానికి నేనే ఉదాహరణ. పొన్నూరులో చదువుకుంటున్న సమయంలో అక్కడ ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో దండం పెట్టుకుని వాడిని, అలాగే బాపట్లలో తమ కుటుంబం ఉంటున్న రోజుల్లో సాయంత్రం ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఆంజనేయస్వామి గుడి దగ్గరికి వెళ్లి ప్రసాదం తెచ్చుకునేవాడినని చిరంజీవి తెలిపారు. చిన్నప్పటి నుంచి ఆయన వెంట నేనే పడ్డానా? నా వెంట ఆయన పడ్డానో తెలియదు గానీ నా జీవితంలో ఆంజనేయుడు అంతర్భాగమైపోయాడని చిరు పేర్కొన్నారు. ఎంత కష్టం వచ్చినా రాత్రి ఆంజనేయుడికి చెప్పుకుంటే ఉదయానికి పరిష్కారం దొరుకుతుందని మెగాస్టార్ ఓ ఈవెంట్‌లో తెలిపారు.

కాగా.. హనుమజ్జయంతిని పురస్కరించుకుని తన నివాసంలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు చిరంజీవి. అయితే ఈ సందర్భంగా ఆంజనేయుడు తన లీలను చూపించాడని ఓ వీడియో పంచుకున్నారు చిరు. శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా మా పూజ మందిరంలో జరిగిన ఓ విశేషాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు.. సప్తవర్ణాలుగా మారి మా పూజా మందిరంలో ఉన్న హనుమంతుడిని పై నుంచి కింది వరకు స్పృశిస్తూ ప్రసరించడం చూస్తుంటే ఆ దృశ్యం.. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను.

ఇటీవల మనం ఆయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యకాంతి ప్రసరించి మెరుస్తున్న అద్భుతాన్ని చూశాం. అలాగే కోణార్క్, అరసవిల్లి దేవాలయాల్లో కూడా సూర్యకిరణాలు భగవంతుడిని తాకే విశేషం అందరికీ తెలిసిందే. అలాంటి దైవానుభూతి.. మా ఇంట్లోనూ ఆంజనేయుడిని స్పృశించడం అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ పవిత్రమైన హనుమజ్జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మెగాస్టార్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

Read more about: chiranjeevi hanuman jayanti
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X