ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు... ఆ తప్పు మీ వల్లే... చిరంజీవి షాకింగ్ కామెంట్స్

చిత్ర పరిశ్రమకు వచ్చే అమ్మాయిల్ని అవకాశాల పేరుతో ట్రాప్ చేసి వారిపై లైంగిక కోరికలు తీర్చుకోవడం, వారి జీవితాలను నాశనం చేయడం తెలిసిందే. ఈ క్యాస్టింగ్ కౌచ్‌పై ప్రతినిత్యం ఏదో ఒక మూల .. ఎవరో ఒకరు చెబుతూనే ఉంటారు. ఎందరో హీరోయిన్లు, మహిళా నటులు చిత్ర పరిశ్రమలో తాము ఎదుర్కొన్న అనుభవాలను, సంఘటనలను బయటపెడుతూనే ఉన్నారు. ఈ పరిణామాలతో తల్లిదండ్రులు.. తమ బిడ్డలను సినీరంగం వైపు పంపాలంటేనే భయపడే పరిస్ధితులు నెలకొన్నాయి. తాజాగా చిత్ర పరిశ్రమను వేధిస్తోన్న ఈ క్యాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వరల్డ్ వైడ్‌గా 300 కోట్లకు పైగా వసూళ్లతో చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో జనవరి 25న సక్సెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Mega Star Chiranjeevi Shocking Comments on Casting Couch in Film Industry at Mana Shankara Vara Prasad Garu Success Meet

ఏ మెగా హీరో అయినా డేట్స్ ఇస్తాడు
మీ వ్యక్తిత్వం బాగుండాలి, నీ అప్రోచ్ బాగుండాలి, నీ కష్టం బాగుండాలి.. ఇండస్ట్రీ అంతకంత రిజల్ట్ ఇస్తూనే ఉంటుంది. చూద్దాం, చేద్దాం అన్న అపనమ్మకంతో ఉండొద్దు. సినిమా చేయాలని సుస్మిత అనుకుంటే.. మా ఇంట్లో ఉన్న హీరోలలో ఏ హీరో తనను కాదు అంటాడు.. ప్రతి ఒక్కరిని ప్రతిరోజూ కలుస్తుంది. నేను వాళ్లతో చేయను.. ముందు ఎక్స్‌పీరియన్స్ సంపాదించాలి, క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని చెప్పేది. వెబ్ ఫిల్మ్స్ మొదలుపెట్టింది.. లాభం ఏమైనా ఉంటుందా? అని అడిగితే.. లాభం ఏముంటుంది డాడీ.. లక్షల్లోనే మిగులుతుంది లేదంటే లాస్‌ రావొచ్చని చెప్పింది. కానీ నాకు ఎక్స్‌పీరియన్స్ వస్తుంది.. ఎక్కడ డిపార్ట్‌మెంట్ ఉంటుంది? ప్రతి డిపార్ట్‌మెంట్ గురించి తెలుసుకుంటానని చెప్పిందని చిరంజీవి తెలిపారు.

సుస్మితకు నయా పైసా ఇవ్వలేదు
నాన్నగారు వాళ్లంతా ఉన్నారు కాబట్టి సినిమా తీయడం తనకు తేలిక అని సుస్మిత అనుకోలేదు. ఎవరితోనైనా కలిసి సినిమా తీయమంటే.. వాళ్లు మాత్రం నువ్వు ఏం పెట్టొద్దు, నువ్వుం రానక్కర్లేదు. సినిమా మేం చేసేస్తాం, మీ పేరు వేసేస్తాం.. లాస్ట్‌కి వచ్చేసరికి ఇంత డబ్బు ఇచ్చేస్తామని చెబితే అస్సలు నాకు అలాంటిది వద్దు అని తేల్చిచెప్పేసింది. నాకు ఎక్స్‌పీరియన్స్ రావాలి, నేను డబ్బులు పెట్టాలి, నేను పనిచేయాలని చెప్పి ఆ సినిమా క్యాన్సిల్ చేసుకుంది. సాహుతో సినిమా అనుకున్న తర్వాత ఇద్దరు మాట్లాడుకుని.. సగం డబ్బులు తను సొంతంగా పెట్టింది, బయటి నుంచి అప్పు తెచ్చుకుంది తప్పించి నేను నయాపైసా ఇవ్వలేదు. ఇద్దరి నుంచి నా రెమ్యురేషన్ నేను లాక్కుంటూనే వచ్చా. నా కూతురిగా సుస్మితను చూసి నేను గర్వపడుతున్నానని చిరంజీవి అన్నారు.

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు
ఆడబిడ్డయినా, మగబిడ్డయినా ఇండస్ట్రీలో రాణించాలంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇది గొప్ప ఇండస్ట్రీ. ఇక్కడ నేను రాణించలేను, ఇక్కడ నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి, ఇక్కడ బిట్టర్ ఎక్స్‌పీరియన్స్ జరిగాయి అంటే కనుక.. అది నీ తప్పిదం అవుతుంది. నువ్వు స్ట్రిక్ట్‌గా ఉండి... సీరియస్‌గా ఉంటే కనుక ఏ ఒక్కడు అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేయరు. క్యాస్టింగ్ కౌచ్ అలాంటివి ఉండవు.. నీ బిహేవియర్‌ను బట్టి ఉంటుంది.. మీకుండే అభద్రతా భావంతో, ఏమో అలా ఇలా ఉండాలేమో అని ఉండకూడదు. నువ్వు ప్రొఫెషనల్‌గా ఉండు.. అవతలి వాళ్లు కూడా ప్రొఫెషనల్‌గా ఉంటారు. ఇండస్ట్రీ అనేది అద్దం లాంటిది... నువ్వు ఏం ఇస్తావో, తిరిగి అదే ఇస్తుంది. ప్రతి ఒక్కరూ ధైర్యంగా పరిశ్రమలకు రావాలనుకుంటే దృఢ సంకల్పంతో రండి. మీరంతా ఇక్కడ రాణిస్తారు.. అది ఆడపిల్లలైనా, మగపిల్లలైనా అని చిరంజీవి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చిరంజీవి వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X