hari hara veera mallu : పవన్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ లాక్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా, ఏపీ డిప్యూటీ సీఎంగా పరిపాలన, రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. వరుస రివ్యూలు, క్షేత్రస్థాయి పర్యటనలతో తన మార్క్ చూపిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సుపరిపాలనే ధ్యేయంగా తన ఆశయ సాధన కోసం నిరంతరాయంగా కష్టపడుతున్నారు పవన్ . జనసేనాని జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడని ఓ పక్క సంతోషపడుతున్నా.. అభిమానుల్లో ఏదో బాధ. కారణం.. తమ అభిమాన నటుడిని తిరిగి వెండితెరపై చూస్తామో , లేదో అనే ఆలోచన.
చివరిసారిగా బ్రో సినిమాలో మేనల్లుడు సాయిథరమ్ తేజ్‌తో కలిసి తెరపై కనిపించిన పవన్ కళ్యాణ్ .. ఆ తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే అంకితమైపోయారు. ఎన్నికల సీజన్ కావడంతో అభ్యర్ధుల ఎంపిక, ప్రచారంతో పాటు ఫలితాల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే పవన్ చేతిలో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. వీటిని త్వరగా కంప్లీట్ చేసి బరువు దించుకోవాలని పవన్ భావిస్తున్నారు.

అయితే పాలనలో కీలక బాధ్యతల్లో ఉన్నందున తాను సినిమాలు చేస్తే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని జనసేనాని భయపడుతున్నారు. దీనికి తోడు ప్రత్యర్ధులకు తనపై బురదజల్లే అవకాశం తానే ఇచ్చినట్లుగా ఉంటుందని పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గుతున్నారు. కానీ తాను కమిటైన ను కంప్లీట్ చేయాలని డిప్యూటీ సీఎం భావిస్తున్నారు. వారంలో శని, ఆదివారాలు కానీ మరోదైనా మార్గంలో షూటింగ్ వేగంగా పూర్తి చేయాలని ఆయన స్కెచ్ గీస్తున్నారు.
తొలుత సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీని పవన్ పూర్తి చేస్తారనే టాక్ వినిపించింది. కానీ అంతకంటే ముందే హరిహర వీరమల్లును జనసేనాని ఫినిష్ చేస్తారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం వీరమల్లు టీమ్ పవన్‌ను కలిసింది. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు షూటింగ్ నెక్ట్స్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుందని .. ఇందుకోసం బాలీవుడ్ లెజెండరీ స్టంట్ మాస్టర్ నిక్ పావెల్ పర్యవేక్షణలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ జరగనుందని వార్తలు వచ్చాయి. ఈ షూటింగ్‌లో జనసేనాని పాల్గొంటారని.. దాదాపు 400 మందితో ఈ ఫైట్ సైట్ ఉంటుందని ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి.

"UNSTOPPABLE FORCE, UNBREAKABLE SPIRIT" Storming into cinemas near you on March 28th, 2025! 💥
— Mega Surya Production (@MegaSuryaProd) September 23, 2024
The Warrior Outlaw ~ Powerstar @PawanKalyan garu Joins the Shoot! 💥⚔️#HariHaraVeeraMallu Shoot Resumed Today at 7 AM in a set erected at Vijayawada. 🔥 pic.twitter.com/lNlR04TFka
హరిహర వీరమల్లును తొలుత క్రిష్ జాగర్లమూడి స్టార్ట్ చేసినప్పటికీ .. పవన్ రాజకీయాల్లోకి వెళ్లడం, షూటింగ్ లేట్ అవుతూ ఉండటంతో ప్రాజెక్ట్ మధ్యలోనే ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ మెగా ఫోన్ పట్టారు. షూటింగ్‌కు శరవేగంగా కంప్లీట్ చేస్తున్న ఆయన.. పవన్ కళ్యాణ్ రాకకోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే పవర్‌స్టార్ సెట్స్‌లో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హరిహరవీరమల్లుకు సంబంధించి మేకర్స్ కీ అప్‌డేట్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా 2025 మార్చి 28న హరిహర వీరమల్లుని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లుగా మెగా సూర్య ప్రొడక్షన్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











