Mega156 హనుమాన్ అండతో చిరంజీవి నెక్ట్స్ మూవీ.. అందరూ ఊహించిన పవర్‌ఫుల్ టైటిల్‌తోనే!

మెగాస్టార్ చిరంజీవి, బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న Mega156 మూవీ ప్రాజెక్ట్ ప్రకటనకు ముందు నుంచే భారీ అంచనాలను పెంచింది. ఈ సినిమా సైంటిఫిక్, మైథాలజీ ఫిక్షన్ సినిమాగా రూపొందుతున్నారనే విషయం సినీ, అభిమాన వర్గాల్లో అంచనాలు పెంచింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రివీల్ కార్యక్రమాన్ని సంక్రాంతి పండుగ నేపథ్యంలో చేపట్టారు. ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. ఆ సినిమా టైటిల్ వివరాల్లోకి వెళితే..

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ నిర్మిస్తుండగా, చిరంజీవి నటించబోయే 156 వ సినిమాకు అందరూ ఊహించినట్టుగానే విశ్వంభర అనే టైటిల్‌ను ప్రకటించారు. హనుమాన్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతుందనే చిన్న ట్విస్టును లీక్ చేశారు. ఆంజనేయుడు భక్తుడిగా ఉన్న చిరంజీవికి అదే కథతో సినిమాను రూపొందించబోతున్నారా? అనే సందేహాలను రేకెత్తించారు.

Vishwambara

విశ్వం నుంచి ఓ గ్రహ శకలం భూమి పడి ఓ విధ్వంసాన్ని క్రియేట్ చేయగా.. విశ్వంభర అంటూ ఓ గొంతు కొత్త అనుభూతిని పంచేలా చేసింది. టైటల్‌ లుక్‌తోనే ఈ సినిమాపై మరోసారి మరింత అంచనాలు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాను 2025 సంక్రాంతి బరిలో నిలుపుతున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది.

నటీనటులు: చిరంజీవి తదితరులు
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
మ్యూజిక్: ఎంఎం కీరవాణి
బ్యానర్: యూవీ క్రియేషన్స్
సినిమాటోగ్రఫి: చోటా కే నాయుడు
క్యాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదేల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కొమిరెడ్డి
సాహిత్యం: శివశక్తి దత్తా, చంద్రబోస్
బ్యానర్: యూవీ క్రియేషన్స్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X