ఎన్టీఆర్ దర్శకుడితో మెగాస్టార్.. అది రీమేక్ కాదట!
మెగాస్టార్ చిరంజీవి నేటితరం యువ హీరోలు కంటే వేగంగా సినిమాలను చేస్తున్నాడు. ఆరు పదుల వయసులో ఉన్న ఆయన ఎనర్జి ఏ మాత్రం తగ్గలేదు నెక్స్ట్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అపజయం లేని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తుండడం మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్.
అయితే ఈ సినిమా అనంతరం మెగాస్టార్ మళయాళం లుసిఫర్ రీమేక్ పై ఫోకస్ పెట్టాడు. అనంతరం మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత కూడా మరో రీమేక్ సినిమాతోనే రాబోతున్నాడు అని గత ఏడాది నుంచి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ జై లవకుశ సినిమాతోనే బాబీ దర్శకత్వ ప్రతిభను అమితంగా మెచ్చుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమా చూసే అతనికి ఆఫర్ ఇచ్చాడు. అయితే అది కూడా రీమేక్ అనే రూమర్స్ వస్తున్నాయి. నిజానికి అది రీమేక్ కాదట. బాబీ సొంతగానే రాసుకున్నట్టుకు తెలుస్తోంది. రైటర్ గా ఎంతో అనుభవం ఉన్న బాబీ చాలా వరకు తన సినిమాల కథలను డైలాగ్స్ ను సొంతగానే రాసుకోగలడు. ఇక మెగాస్టార్ రేంజ్ కు తగ్గట్లు అద్భుతమైన కథను సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి మరోసారి మెగాస్టార్, అలాగే నిర్మాతలతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











