కమెడియన్ ఫిష్ వెంకట్‌కు తీవ్ర ఆనారోగ్యం.. అండగా చిరంజీవి, రాంచరణ్!
తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన డైలాగ్ డెలివరీతో తన మార్కు చూపించిన కమెడియన్ కమ్ విలన్ ఫిష్ వెంకట్. గత కొద్దికాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆర్థిక పరిస్థితి కూడా అంతంతా మాత్రంగా ఉండటంతో వైద్యం కోసం ఆయన ప్రభుత్వ గాంధీ హాస్పిటల్‌లో చేరారు. అయితే ఈ విషయం తెలిసిన మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్పందించారు. పిష్ వెంకట్‌కు సంబంధించిన విషయాల్లోకి వెళితే..
ఆది సినిమాతో తనకంటూ గుర్తింపు తెచ్చుకొన్న ఫిష్ వెంకట్ హైదరాబాద్‌లోని రాంనగర్ ప్రాంతంలో నివస్తున్నాడు. ఆయన కొద్ది నెలలుగా అనారోగ్యానికి గురయ్యాడు. కాళ్లకు గాయాలు కావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ దశలో రెండు కాళ్లు తీసేయాలని వైద్యులు సూచించారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో గాంధీ హస్పిటల్‌లో చేర్పించాం అని కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే గాంథీ హాస్పిటల్‌లో చేరిన ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఇటీవల ఆయన డిశ్చార్జ్ అయ్యారు. కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పిన సూచన మేరకు ఆయన ఇంటిలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది అని స్నేహితులు, సన్నిహితులు చెప్పారు.
అయితే హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఫిష్ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీ నాకు అండగా నిలిచారు. చిరంజీవి, రాంచరణ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. వారు నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని అండగా నిలిచారు. అందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఫిష్ వెంకట్ చెప్పారు.

ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో ఇండస్ట్రీ వర్గాలు, ఆయన స్నేహితులు, సన్నిహితులు స్పందించి అండగా నిలుస్తున్నారు. తనపై ప్రేమ కురిపిస్తున్న తీరు చూసి ఆయన ఆనందంలో మునిగిపోయారు. త్వరగా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











