twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు రామలింగయ్యతో నాకున్న అనుబంధం.. అ విదంగా వారి పిల్లలకు కూడా లేదు: చిరంజీవి

    |

    అల్లు రామలింగయ్య గారి 100వ పుట్టినరోజు సందర్భంగా అల్లు ఫ్యామిలీ ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇక ఈ వేడుకకు పాల్గొన్న ప్రముఖ సినీనటులు రాజకీయ నాయకులు ఆయన గొప్పతనం గురించి తెలియజేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు రామలింగయ్య తో ఉన్న అనుబంధం గురించి ఎంతో సరదాగా చెబుతూనే ఆయన గొప్పతనం గురించి వివరణ ఇచ్చారు. ఆ వివరాలలోకి వెళితే..

    ఆయనతో అనుబంధం

    ఆయనతో అనుబంధం

    మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అల్లు రామలింగయ్య గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనతో నాకున్న అనుబంధం ఇక్కడ ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయనతో నేను ఎక్కువగా సినిమాలు చేశాను. ఎక్కువ సమయం గడిపాను. వారి కొడుకు మనవళ్లకు కూడా ఆ స్థాయిలో అనుబంధం లేదు. ఆయన ఉన్నతత్వం గురించి నాకు చాలా బాగా తెలుసు.. అని చిరు తెలియజేశారు.

    మొదటి పరుచయం

    మొదటి పరుచయం

    నాకు ఆయనతో మొదటి పరిచయం మన ఊరి పాండవులు సినిమాతో ఏర్పడింది. రాజమండ్రిలో ఆయనతో పాటు షూటింగ్ చేస్తున్న సమయంలో ఆటపట్టించే పాటతో షూటింగ్ మొదలైంది. షూట్ లో భాగంగా ఆయనను గట్టిగా పట్టుకున్నప్పుడు కాస్త చిరాకుగా ఉండేవారు బయట కామెడీగా ఉన్నప్పటికీ ఈయనేంటి ఇలా ఉన్నారు అని అనుకునేవాడిని.మ్ ఆ తర్వాత నా గురించి వివిధ రకాల విషయాలు ఆయన కూడా తెలుసుకున్నారు.

    ఇంటి అల్లుడిగా కాకుండా

    ఇంటి అల్లుడిగా కాకుండా

    అల్లు రామలింగయ్య గారికి మరో కొడుకు ఉండేవారు. ఆయన రెండో కొడుకుని హీరోగా చేయాలని అనుకున్నారు.. కానీ రెండో బిడ్డని కోల్పోయినప్పటికీ అతని స్థానంలో నన్ను చూసుకుంటూ వారి ఇంట్లో కొడుకు విజయాలు సాధించినట్లు కూడా ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. వారింట్లో వాళ్ళ ఇంటి సభ్యులు కూడా నన్ను ఒక సోదరుడిగా చూసేవారు. ఇంటి అల్లుడిగా కాకుండా ఇంటి బిడ్డగా చూసుకునేవారు. అని మెగాస్టార్ అన్నారు.

    రైతు కుటుంబంలో పుట్టి

    రైతు కుటుంబంలో పుట్టి

    ఆయన వ్యక్తిత్వం అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇక్కడ పుట్టాము పెరిగేము చచ్చిపోయాము అని కాకుండా మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము ఎంత ఎత్తుకు వెలగాలి ఎలాగైనా లక్ష్యాన్ని సాధించాలి అనే విధంగా ఉదాహరణగా నిలిచారు. ఒక రైతు కుటుంబంలో పుట్టి నాటకల్లో అవకాశం కోసం మేనేజర్స్ కు బియ్యం లంచంగా ఇచ్చి అవకాశం అందుకున్నారు.. అని అన్నారు.

    డాక్టర్ గా కూడా..

    డాక్టర్ గా కూడా..

    నటుడు అవ్వాలి అలానే కొనసాగాలి అనుకోకుండా వైద్యుడిగా కూడా ఉండాలి అని ఆర్ఎంపీ చదువుకున్నారు. తన చదువును మధ్యలో ఆపేయకుండా వైద్య విద్యను కొనసాగించారు. ఆ విధంగా ఎవరు ఉండరు నేను. అయితే మరో వ్యాపారాల వైపు కూడా అడుగు పెట్టలేదు. కానీ మధ్యలో పాలిటిక్స్ చేశాను అది వేరే విషయం.

    కానీ ఆయన మాత్రం డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు. పుస్తకాలు కూడా తెప్పించుకొని చదువుకున్నారు. ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేసి సర్టిఫికెట్ పొందారు. ఇండస్ట్రీలో డాక్టర్ అయ్యారు. ప్రతి ఒక్కరి నాలుక మీద మందులు వేశారు. ఇప్పటికీ కూడా మా ఇంట్లో వైద్యం కొనసాగుతూనే ఉంది. కృష్ణ గారికి అక్కినేని నాగేశ్వరరావు గారికి అలాగే ఇక్కడ ఉన్న కోట శ్రీనివాసరావు గారికి కూడా ప్రతి ఒక్కరికి మందు వేశారు.. అని చిరంజీవి తెలియజేశారు.

    English summary
    Megastar chiranjeevi about bonding with Allu Ramalingaiah
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X