ఆ సినిమా చూసి ఫుల్లుగా ఏడ్చేశా.. హీరోయిన్ కొంగుతో తుడుచుకొన్నా.. చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై ఎన్నో యాంగిల్స్ లో అభిమానులను ఆకట్టుకుంటారు. ఇక రియల్ లైఫ్ లో మాత్రం ఆయన చాలా సరదాగా ఉంటారని ఇంటర్వ్యూలను చూస్తుంటే చాలా ఈజీగా అర్ధమవుతుంది. ఇక మొన్న బిగ్ బాస్ షోలో మెగాస్టార్ ఏ రేంజ్ లో ఆకట్టుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల సమంత హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆహా షోలో కూడా అదే తరహాలో ఆకట్టుకున్నారు.

ఆహా అనిపించిన మెగాస్టార్

ఆహా అనిపించిన మెగాస్టార్

సమంతహోస్ట్ గా వ్యవహరిస్తున్న డిజిటల్ షో సామ్జామ్. అగ్ర తారలతో చిట్ చాట్ చేస్తూ ఆ షో స్థాయిని పెంచిన సమంత మెగాస్టార్ చిరంజీవిని కూడా అదే తరహాలోఇంటర్వ్యూ చేసింది. మెగాస్టార్ చిరంజీవితన కెరీర్కి సంబందించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆ షో ద్వారాబయటపెట్టారు. తన ఫ్యామిలీ గురించి అలాగే సక్సెస్గురించి కూడా చెప్పి ఆహా అనిపించారు.

చీకట్లో ఆమె చీర నా చేతిలో..

చీకట్లో ఆమె చీర నా చేతిలో..

అయితే ఒకానొక సమయంలో ఒక సినిమా ప్రివ్యూ షో చూస్తుండగా విచిత్రమైన సంఘటన చోటు చేసుకుందట. చీకట్లో ఉన్నప్పుడు హీరోయిన్ చీర కొంగు చేతిలోకి వచ్చేసరికిఅప్పుడే లైట్స్ ఆన్ అయ్యాయనిఅది చూసిఅందరు ఒక్కసారిగా షాక్ అయినట్లు వివరించారు. అప్పుడు అల్లు రామలింగయ్య ఫ్యామిలీ కూడా ఉన్నట్లు వివరణ ఇచ్చారు.

సినిమా చూసి ఏడ్చేశాను

సినిమా చూసి ఏడ్చేశాను

ఆ ఘటన గురించి మాట్లాడుతూ.. నటి మంజు భార్గవితో నేను కోతలరాయుడు అనే సినిమా చేస్తున్నాను. అప్పుడే ఆమె నటించినశంకరాభరణం సినిమా విడుదలైంది. అయితే ప్రివ్యూవేశారని సినిమా చూడటానికి ఆమె రమ్మని పిలిచింది. అప్పుడు నేను ఆ సినిమా చూసిఎంతగానో ఏడ్చేశాను. కన్నీళ్లు ఏ మాత్రం ఆగలేదు.

నాకు తన చీర కొంగును ఇచ్చింది

నాకు తన చీర కొంగును ఇచ్చింది

థియేటర్స్ లో లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. లైట్స్ ఆన్ చేయకముందేకన్నీళ్లు తుడుచుకోవటానికి ఏదైనా ఖర్చిఫ్ ఉందేమో అని వెతుకుతున్నాను. అప్పుడు పక్కనేఉన్న మంజుభార్గవి నాకు తన చీరకొంగునుఇచ్చింది. అలా కన్నీళ్లు తుడుచుకుంటున్న సమయంలో లైట్స్ ఆన్ చేశారు. అప్పుడు ఆమె కొంగు కూడా నా చేతిలో ఉంది. అది అందరూ చూసి ఏమనుకున్నారోఏమో అనిపించింది.

Recommended Video

Chiranjeevi Releases Shasi Movie Teaser
సురేఖ పెళ్లికి ఒప్పుకోదేమో అనుకున్నాను

సురేఖ పెళ్లికి ఒప్పుకోదేమో అనుకున్నాను

ఇక అదే సమయంలో అల్లు రామలింగయ్య ఫ్యామిలీ కూడా అక్కడికి వచ్చింది. అప్పటి నాకు ఇంకా పెళ్లి కాలేదు. వాళ్లలోసురేఖ కూడా ఉందని అనుకుంటున్నాను. పెళ్లి నిశ్చయమైనప్పుడు అసలు ఒప్పుకొని ఉండదుఅనుకున్నాను. కానీ ఒప్పుకుంది. అంటూ మెగాస్టార్ చిరంజీవి సరదాగావివరణ ఇచ్చారు.

 ఆ సినిమా వల్ల వెక్కి వెక్కి ఏడ్చాను

ఆ సినిమా వల్ల వెక్కి వెక్కి ఏడ్చాను

ఒక సినిమా ప్లాప్ అయిన సినిమాలోవెక్కి వెక్కి ఏడ్చానని చెబుతూ.. ఖైదీ సినిమా హిట్ అవ్వగానే అదే కాంబినేషన్ లో వచ్చిన సినిమా వేట. దర్శకుడు నిర్మాత నేను.. అదే కాంబినేషన్ లో వచ్చిన సినిమా కదా అని హిట్ అవుతుందనిఅనుకున్నాను. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అప్పుడు ఇంటికి వెళ్లి దుప్పటి కప్పుకొని ఎంతగానో ఏడ్చాననిమెగాస్టార్ తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X