Acharya First Review: చిరంజీవి, చరణ్ డెడ్లీ కాంబినేషన్.. మొత్తంగా సినిమా ఎలా ఉందంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కువ మంది ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆచార్య సినిమా టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ తో RRR తర్వాత ఎంతో ఇష్టంగా చేసినటువంటి ఆచార్య తప్పకుండా అంచనాలను అందుకునేలా ఉందనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ క్రమంలో దుబాయ్ సెన్సార్ మెంబర్ అయినటువంటి ఉమైర్ సందు కూడా సినిమాకు సంబంధించిన మొదటి రివ్యూ ఇచ్చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే.

అత్యధిక థియేటర్స్ లో..

అత్యధిక థియేటర్స్ లో..

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కూడా కలిసి నటించిన యాక్షన్ డ్రామా ఆచార్య ఈనెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరీర్లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతుండటం విశేషం. తప్పకుండా మొదటిరోజే ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందని సమాచారం.

ధర్మకోసం..

ధర్మకోసం..


దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాలో ధర్మం అనే పాయింట్ ను హైలెట్ చేస్తూ.. ఇద్దరు నక్సలైట్స్ ఒక మంచి ధర్మం కోసం ఎలా పోరాడారు వారి ఇద్దరి సంఘర్షణలో ఎలాంటి అనుభూతులను పొందుతారు అలాగే ఈ సినిమాలో ఒక ఎమోషనల్ కంటెంట్ హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర సెకండాఫ్ లో 40 నిమిషాల పాటు ఉంటుందట.

 అభిమానులకు నచ్చే విధంగా..

అభిమానులకు నచ్చే విధంగా..

ధర్మస్థలి దేవాలయం ప్రాంతంలో ఒక ఆపద వచ్చినప్పుడు హీరోలు ఎలా పోరాడారు.. ఆ తర్వాత నక్సలైట్ గా ఎలా మారాడు.. అనంతరం వారికి ఎదురైన అతి పెద్ద సమస్య ఏమిటి అనే అంశం కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అని అంటున్నారు. ఈ సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా అభిమానులకు నచ్చే విధంగా ఉంటాయట.

మొదటి రివ్యూ

మొదటి రివ్యూ

ఇక టాలీవుడ్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేసే దుబాయ్ సెన్సార్ యూనిట్ సభ్యుడు ఉమైర్ సందు కూడా ఆచార్య సినిమాను ప్రత్యేకంగా వీక్షించాడు. తనదైన శైలిలో మొదటి రివ్యూ కూడా అందించే ప్రయత్నం చేశాడు. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉండటంతో తాను కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లుగా సందు వివరణ ఇచ్చాడు.

డెడ్లీ కాంబినేషన్

డెడ్లీ కాంబినేషన్


ఆచార్య సినిమాలో రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి పాత్రలు అద్భుతంగా వచ్చినట్లు తెలియజేశాడు ఎంటర్టైన్మెంట్ అందించడంలో ఈ కాంబినేషన్ డెడ్లీ గా ఉంది అంటూ మాస్ ప్రేక్షకులను కూడా ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉన్నట్లు తన రివ్యూలో తెలియజేశాడు.

ఆట నియమాలను తిరగరాస్తూ .

ఆట నియమాలను తిరగరాస్తూ .

ఇది ఆట నియమాలను తిరిగి వ్రాస్తుంది అంటూ..
పండుగ సందర్భం, సినిమా సామర్థ్యానికి సహాయం చేస్తుంది.. అని సందు తెలియజేశాడు. ఈద్ పండగలో తప్పకుండా సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి సినిమా అద్భుతంగా వచ్చినట్లు కనిపిస్తోంది. మరి ఈ శుక్రవారం విడుదలయ్యే ఆచార్య సినిమా లోకల్ ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X