ఆచార్య అఫీషియల్ అప్డేట్.. రంగంలోకి దిగనున్న మెగాస్టార్, సినిమా వచ్చేది ఎప్పుడంటే?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో నెవర్ బిఫోర్ అనేలా రెడీ అవుతున్నారు. ఆయన లైనప్ చూస్తేనే అర్ధమవుతోంది.. ఎలాంటి హిట్స్ అందుకోబోతున్నారో. ఇక సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ఇక మొదట ఆచార్య సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతున్న షూటింగ్ రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చేశారు.

అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది
మెగాస్టార్ సైరా సినిమాతో అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయినప్పటికి తెలుగు ప్రేక్షకులలో అంచనాలు మాత్రం అస్సలు తగ్గలేదని అర్థమయ్యింది. ఇక త్వరలోనే ఆయన ఆచార్య సినిమాతో అసలైన బాక్సాఫీస్ హిట్ అందుకొనున్నట్లు అర్ధమవుతోంది. రీసెంట్ గా చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన ఒక అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చేసింది.

నవంబర్ 9న నుంచి రంగంలోకి మెగాస్టార్
బాక్సాఫీస్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ సోషల్ డ్రామా ఆచార్యలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ ఇంకా సగం పూర్తవ్వాల్సి ఉంది కాబట్టి నవంబర్ 9న మేజర్ షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారు. కేవలం నెలరోజుల్లోనే వీలైనంత వరకు షూటింగ్ పనులను ముగించుకోనున్నట్లు తెలిపారు.

సినిమాక్ రిలీజ్ ఎప్పుడంటే..
ఇక సినిమా విడుదల విషయానికి వస్తే సంక్రాంతికె రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికి అప్పటి కుదరడం లేదు. ఇక ఫిబ్రవరిలోపు సినిమా పనులన్నింటిని పూర్తి చేసి 2021 సమ్మర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేయాలని దర్శకుడు కొరటాల ఇటీవల మెగాస్టార్ తో చర్చించినట్లు సమాచారం.

ఆచార్య తరువాత ఆ సినిమాలో..
కరోనా వైరస్ ని దృష్టిలో ఉంచుకొని అత్యంత భద్రతా జాగ్రత్తల నడుమ సినిమా షూటింగ్ ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గత ఏడెనిమిది నెలలుగా ఎక్కువగా బయటకు వెళ్లడం లేదు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటూ భవిష్యత్తు ప్రాజెక్టులపై ప్రణాళికలు రచిస్తున్నారు. ఆచార్య అనంతరం వేదాళం రీమేక్ ను స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











