సుకుమార్ డైరెక్షన్‌లో మెగాస్టార్.. చిరంజీవి షేర్ చేసిన ఫోటోలు వైరల్

మెగాస్టార్ చిరంజీవి నేటి తరం యువ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఆరు పదుల వయసులో కూడా చాలా చలాకీగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి మిగతా స్టార్ హీరోల మాదిరిగానే ఏడాదికి ఒక సినిమా చేసుకుంటూ వెళ్లే వారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన యువ హీరోల కంటే వేగంగా వెంట వెంటనే ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ ఉండడం విశేషం. ఇక రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక షూటింగ్ పనిని పూర్తి చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

రాబోయే సినిమా

రాబోయే సినిమా

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత సైరా అనే సినిమా కోసం కొంత ఎక్కువ సమయాన్ని తీసుకున్నారు. ఇక ఆ తర్వాత ఆచార్య సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నప్పటికీ కూడా ఆ ప్లాన్ సక్సెస్ కాలేదు. కరోనా కారణంగా ఆచార్య సినిమా గత ఏడాది నుంచి వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా ఈ సినిమాను ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఆ సినిమాలో రామ్ చరణ్ తేజ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.

చిరు మనసులో సుకుమార్

చిరు మనసులో సుకుమార్

మెగాస్టార్ కేవలం సీనియర్ దర్శకులతో మాత్రమే కాకుండా యువ దర్శకులతో కూడా ఎక్కువ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మెగాస్టార్ కు ఎవరైనా దర్శకుడు నచ్చితే మాత్రం అతన్ని పిలిపించుకొని మరి అవకాశాలు ఇస్తున్నారు. ఇక మెగాస్టార్ మనసులో సుకుమార్ కూడా ఉన్నారు. రంగస్థలం సినిమా ఫలితాన్ని చూసిన చిరంజీవి సుకుమార్ ఫిదా అయిపోయాడు. అప్పట్నుంచి అవకాశం దొరికితే సుకుమార్ తో మూవీ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు.

 నిజమే అనుకున్నారు..

నిజమే అనుకున్నారు..

అయితే ఫైనల్ గా సుకుమార్ కు చిరంజీవి యాక్షన్ చెప్పే అవకాశం వచ్చింది. గతంలోనే దర్శకుడు సుకుమార్ మెగాస్టార్ చిరంజీవి తో కలిసి వర్క్ చేయబోతున్నట్లుగా సోషల్ మీడియా ఒక వార్త వైరల్ అయింది. అది నిజమే అని సుకుమార్ కూడా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చాడు. దీంతో అందరూ ఈ కాంబినేషన్లో సినిమా వస్తుంది అని అనుకున్నారు.

 యాడ్ ఫిల్మ్ కోసం..

యాడ్ ఫిల్మ్ కోసం..

కానీ నిజానికి వాళ్లు సినిమా కోసం కలసి పని చేయలేదు. ఒక యాడ్ షూటింగ్ కోసం వర్క్ చేసినట్లుగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. దర్శకుడుగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ యాడ్ ఫిల్మ్ కోసం, వారి దర్శకత్వం లో చేసిన షూటింగ్ లో నేను చాలా ఎంజాయ్ చేశాను. ఈ యాడ్ నిర్మించిన శుభగృహ రియల్ ఎస్టేట్ వారికి శుభాభినందనలు.. అని చిరంజీవి సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ పేర్కొన్నారు. ఇక ఆ ఫొటోలో మెగాస్టార్ చాలా యంగ్ గా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

 మెగాస్టార్ పవర్ఫుల్ లైనప్

మెగాస్టార్ పవర్ఫుల్ లైనప్

ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లైనప్ విషయానికి వస్తే ఆచార్య సినిమా అనంతరం గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్ సినిమా రానుంది. ఇక బాబి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మెగాస్టార్ యువ దర్శకుడు వెంకీ కుడుముల తో కూడా ఇటీవల ఒక సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X