చిరంజీవి గ్రాండ్ సక్సెస్ పార్టీ! ఆ మెగా హీరో మళ్ళీ మిస్ అవుతాడా?

2024 ఏపీ ఎలెక్షన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడి సక్సెస్ ను సెలెబ్రేట్ చేయడానికి ఓ భారీ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పార్టీలో ఓ మెగా హీరో మిస్ కాబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఆ మెగా హీరో ఎవరు అనే విషయంపై లుక్కేద్దాం.

జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి వంగా గీతపై పవన్ కళ్యాణ్ 70 వేల ఓట్ల ఆధిక్యంతో విజయభేరీ మోగించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు పలువురు స్టార్స్ నుంచి అభినందనలు వెలువెత్తుతున్నాయి.

Megastar Chiranjeevi and his family are hosting a lavish party for pawan kalyan victory

పవన్ కళ్యాణ్ కు చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్స్ చేసిన విషయం తెలిసింది. ఈ లిస్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదలుకొని అల్లు అర్జున్, నితిన్, నాని, రవితేజ వంటి ప్రముఖ హీరోలు, మెగా హీరోలు అందరూ ఉన్నారు. అందరిలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడికి అభినందనలు తెలియజేశారు.

అయితే అక్కడితో ఆగకుండా తన తమ్ముడి సక్సెస్ సంబరాన్ని మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన ఓ లావిష్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశం కోసం న్యూ ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొనడానికి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నారు.

Megastar Chiranjeevi and his family are hosting a lavish party for pawan kalyan victory

మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తమ నివాసంలో విలాసవంతమైన పార్టీని నిర్వహిస్తున్నారు. ఈ పార్టీకి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు కాబోతోంది. అందులో మెగా హీరోలు కూడా ఉంటారు. ఒక్క అల్లు అర్జున్ తప్ప. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 : ది రూల్ షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Megastar Chiranjeevi and his family are hosting a lavish party for pawan kalyan victory

ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీలో పాల్గొంటారా లేదా అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. గతంలో కొన్నిసార్లు కూడా ఇలాగే మెగా పార్టీలకు మిస్ అవ్వడం వల్ల మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అంతేకాదు ఏఎ ఎలెక్షన్స్ లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు కాకుండా వైఎస్సార్సీపీ నాయకుడికి సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X