మొన్న గోవాలో నాతోనే.. అంతలోనే ఇలా.. భాగ్యరాజ్ మరణంపై చిరంజీవి ఎమోషనల్

లెజెండరీ డైరెక్టర్ కే భాగ్యరాజ్ హఠాన్మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. 73 ఏళ్ల వయసులో గుండెపోటుతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 50 ఏళ్ల కెరీర్‌‌లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా, సింగర్‌గా తనదైన ముద్ర వేసిన భాగ్యరాజ్ మరణంతో సినీరంగానికి తీరని లోటు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం భాగ్యరాజ్ మరణం పట్ల సంతాపం తెలియజేస్తూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

కే భాగ్యరాజ్- చిరంజీవిల మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. ఇద్దరూ నెలల వ్యవధిలో ఒకేసారి సినీరంగంలో అడుగుపెట్టారు. మద్రాస్‌లో ఉన్నప్పటి నుంచే భాగ్యరాజ్‌తో చిరుకి పరిచయం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చేసినా, చిరంజీవి మెగాస్టార్‌గా ఎదిగినా భాగ్యరాజ్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. 80's నటీనటుల గెట్ టూ గెదర్‌లో ఈ ఇద్దరూ ఖచ్చితంగా పాల్గొంటూ నాటి సంగతులు, పాత విషయాలను గుర్తుచేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు.

Megastar Chiranjeevi and Venkatesh Expresses Shock Over Demise of K Bhagyaraj

రెండ్రోజుల క్రితం గోవాలో జరిగిన నటి ఖుష్బూ కుమార్తె అవంతిక - శ్రవణ్ శ్రీనివాసన్‌ల వివాహానికి దక్షిణాది ఇండస్ట్రీ మొత్తం తరలివచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కపూర్, జాకీష్రాఫ్, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జునలతో పాటు భాగ్యరాజ్ కూడా హాజరయ్యారు. చాలారోజుల తర్వాత మిత్రులంతా ఒక్క చోటే చేరడంతో అంతా గోల గోల చేశారు, ఫోటోలకు ఫోజులిస్తూ సెల్ఫీలు దిగుతూ హల్‌చల్ చేశారు. అయితే ఊహించని విధంగా గంటల వ్యవధిలోనే భాగ్యరాజ్ కన్నుమూయడంతో ఆయన సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు. చిరంజీవి, వెంకటేష్‌లతో ఉన్న భాగ్యరాజ్ వీడియో వైరల్ అవుతోంది.

దాంతో మెగాస్టార్ చిరంజీవి బాగా ఎమోషనల్ అయ్యారు. నిన్నటి వరకు తనతోనే ఉన్న మిత్రుడు ఇవాళ కన్నుమూశాడని తెలిసి షాక్ అవుతున్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. మాటల్లో చెప్పలేనంత దిగ్భ్రాంతికి గురయ్యాను, మొన్ననే మేం గోవాలో ఖుష్బూ ఇంటి వివాహ వేడుకలో పాల్గొన్నాం. నవ్వుతూ, జోకులు వేస్తూ, ఫోటోలు దిగుతూ సంతోషంగా గడిపాం. అప్పుడు భాగ్యరాజ్ గారు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉన్నారు. ఈ ఉదయం ఆయన మరణవార్తతో నిద్రలేవడం నమ్మలేకపోతున్నా. భాగ్యరాజ్ భారతీయ సినీరంగానికి అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పూర్ణిమ గారు, శాంతను, వారి కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. నా ప్రియ మిత్రుడి ఆత్మకు శాంతి కలగాలి, ఆయనను మిస్ అవుతానని చిరంజీవి రాసుకొచ్చారు.

విక్టరీ వెంకటేష్ కూడా భాగ్యరాజ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. భాగ్యరాజ్ గారి మరణవార్త కలచివేసింది. ఆయన కథలు భాషలకు అతీతంగా లక్షలాది హృదయాలను తాకాయి. భాగ్యరాజ్ కథనం నుంచి పుట్టిన సుందరకాండ, అబ్బాయిగారు వంటి చిత్రాలలో భాగమైనందుకు నేను అదృష్టవంతుడిని అని భావిస్తున్నాను. భారతీయ సినిమా తన అత్యుత్తమ ఫిల్మ్ మేకర్స్‌లో ఒకరిని కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా హృదయ పూర్వక సంతాపం అని వెంకటేష్ రాసుకొచ్చారు.

Read more about: chiranjeevi venkatesh k bhagyaraj
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X