Baby: బేబి టీమ్‌కు చిరంజీవి సర్‌ప్రైజ్.. లోడింగ్ అంటూ గుడ్ న్యూస్
తెలుగులో ఈ మధ్య కాలంలోనే ఎన్నో కొత్త కొత్త కాన్సెప్టులతో ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే యూత్‌కు కనెక్ట్ అయ్యే కథాంశాలతో రూపొందుతోన్నాయి. అలా వచ్చిన చిత్రాలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో వసూళ్లు కూడా పోటెత్తుతున్నాయి. ఇలా రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'బేబి'. కాంటెంపరరీ లవ్ స్టోరీతో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా సాయి రాజేష్ రూపొందించిన చిత్రమే 'బేబి'. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా అలాంటి టాక్‌ను సొంతం చేసుకుంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలో అయితే దక్కుతోంది. దీంతో ఈ చిత్రానికి వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఇలా ఇప్పటి వరకూ ఈ మూవీ రూ. 37 కోట్లకు పైగా షేర్ రాబట్టడంతో పాటు రూ. 29 కోట్లు వరకూ లాభాలు అందుకుని ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.

'బేబి' మూవీని సామాన్య సినీ ప్రియులతో పాటు సెలెబ్రిటీలు కూడా మెచ్చుకుంటున్నారు. ఇలా ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని చూడడంతో పాటు యూనిట్‌ను అభినందించేందుకు ఓ ఈవెంట్‌ను కూడా నిర్వహించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను చూసి చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవిని 'బేబి' డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ఎస్‌కేఎన్ కలిశారు. ఈ విషయాన్ని సదరు దర్శకుడు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 'కల నిజమైంది. నా దేవుడితో రెండు గంటలు గడిపాను. ఆయన బేబి సినిమాను ఇష్టపడ్డారు. ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. రెండు గంటలు బాబాయ్.. రెండు గంటలు.. బాస్ అలా మాట్లాడుతుంటే కన్నీళ్లు వచ్చాయి. మెగా ఈవెంట్ లోడ్ అవుతోంది' అంటూ గుడ్ న్యూస్ చెప్పాడు.
ఇక, యూత్‌ఫుల్ మెసేజ్‌తో రూపొందిన 'బేబి' మూవీలో విరాజ్ అశ్విన్, నాగబాబు, వైవా హర్ష, లిరిష, కుసుమ, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత కీలక పాత్రలను చేశారు. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











