మరోసారి తాత అయిన చిరు.. పాపకు జన్మనిచ్చిన శ్రీజ!
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సంతోషాలు వెల్లివిరిశాయి. చిరు మరోమారు తాత అయ్యారు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పండంటి పాపకు జన్మనిచ్చింది. తల్లి కూతుళ్లు ఆరోగ్యంగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం శ్రీజ, ఆమె భర్త కళ్యాణ్ దేవ్ సోషల్ ఎండియాలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీజ గర్భవతిగా ఉన్న ఫోటోని షేర్ చేశారు.
క్రిస్మస్ రోజునే శ్రీజ పాపకు జన్మనివ్వడంతో మెగాస్టార్ కుటుంబంలో సంబరాలు రెట్టింపయ్యాయి. శ్రీజకు ఇప్పటికే ఓ కుమార్తె ఉంది. 2016 మార్చిలో శ్రీజ, కళ్యాణ్ దేవ్ వివాహం జరిగింది. కళ్యాణ్ దేవ్ ఇటీవల విజేత చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు రెండవ చిత్రం కోసం ఎదురుచూస్తున్నాడు.

కళ్యాణ్ దేవ్ వ్యాపారవేత్తగా ఉండి నటుడిగా మారాడు. కళ్యాణ్ దేవ్ తొలి చిత్రానికి మంచి మార్కులే పడ్డాయి కానీ ఆశించిన విజయం సాధించలేదు. ప్రస్తుతం మెగాస్టార్ కుటుంబం మొత్తం సినిమాలతో బిజీగా ఉంది.చిరు సైరా చిత్రంలో, రాంచరణ్ వినయ విధేయ రామ చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











