Bhola Shankar మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. అదిరిపోయే డేట్ సెట్ అయ్యింది!

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మెగాస్టార్ ఏకంగా 200 కోట్ల మార్కును అందుకొని మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించాడు. బాస్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు అని రుజువు చేశాడు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ అందరు కూడా భోళా శంకర్ సినిమా కోసం కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ ఫ్యామిలీ కమర్షియల్ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. తమన్నా మెయిన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా కీర్తి సురేష్ ఈ ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి సోదరి పాత్రలో కనిపించబోతోంది. వీరి మధ్యలో ఉండే సిస్టర్ సెంటిమెంట్ సినిమాలో చాలా హైలెట్ కాబోతోంది.

Megastar chiranjeevi bhola shankar movie grand release on August 11th

ఇక భోళా శంకర్ సినిమా రిలీజ్ డేట్ పై గత కొంతకాలంగా కరకాల గౌసిప్స్ అయితే పుట్టుకొస్తున్నాయి. ఇక మొత్తానికి చిత్ర యూనిట్ సభ్యులు ఉగాది సందర్భంగా ఒకరోజు ముందుగానే స్పెషల్ పోస్టర్ పాటు విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చారు. భోళా శంకర్ సినిమాను ఆగస్టు 11వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు ఫ్యాన్స్ కు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఒక విధంగా ఇది ఫ్యాన్స్ కు బెస్ట్ రిలీజ్ డేట్ అని చెప్పవచ్చు.

ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆగస్టు 15 తో పాటు లాంగ్ వీకెండ్ ఈ సినిమాకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కాబట్టి అప్పటికీ కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీత అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X