మరోసారి మెగాస్టార్ చిరు లీక్స్ స్టార్ట్.. భోళా శంకర్ క్రేజ్ అప్డేట్!

రీసెంట్ గా హైదరాబాద్ లో నటసార్వ భౌమ నందమూరి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి రాలేడన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈయనతో పాటు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరు కాలేకపోయారు. తారక్ ఎందుకు రాలేదన్న దానిపై క్లారిటీ ఇచ్చినప్పటికీ.. చిరు ఎందుకు రాలేదన్న దానిపై చాలానే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

అయితే మెగాస్టార్ హైదరాబాద్ లో లేరని అందుకే రాలేకపోయారని కొందరు చెప్పారు. ఆయన ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లారని వివరణ ఇచ్చారు. అయితే ఆయన తన కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి యూరప్ వెళ్లారు. ఇదంతా వాస్తవమే అయినప్పటికీ కేవలం కుటుంబంతో ఎంజాయ్ చేసేందుకు మాత్రమే ఆయన అక్కడికి వెళ్లలేదండోయ్..

chiranjeevi bhola shankar

తన సినిమా షూటింగ్ కోసం కూడా ఈ ట్రిప్ వేశారు. భార్యను కూడా తీసుకెళ్లారు. అయితే ఈ మండు వేసవిలో సస్విట్జర్లాండ్ వెళ్లిన చిరంజీవితో పాటు.. భోలా శంకర్ టీం కూడా వెళ్లింది. ఈ సినిమాలో మెరవబోతున్న మిల్క్ బ్యూటీ తమన్నా కూడా వీరితో పాటు స్విట్జర్లాండ్ వెళ్లింది. ఈక్రమంలోనే వీరిద్దరితో ఓ రెండు పాటలను చిత్రీకరించారు డైరెక్టర్. ఇందులో తమన్నా, చిరు అదిరిపోయే స్టెప్పులు వేసినట్లు సమాచారం.

ఇక మెగాస్టార్ సోషల్ మీడియాలో లీక్స్ అంటూ ఒక ట్వీట్ వేశారు. స్విట్జర్లాండ్ లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట (Song Shoot) ఎంతో ఆహ్లాదంగా జరిగింది! ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను ! త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం !. అప్పటివరకూ ఈ 'చిరు లీక్స్' పిక్స్ అని మెగాస్టార్ వివరణ ఇచ్చారు.

భారతదేశంలో వేడి విపరీతంగా ఉంటుండడంతో.. మహేష్ బాబు సమ్మర్ వస్తే చాలు చల్లగా ఉండే దేశాలకు ఫ్యామిలీతో పాటు ఎగిరిపోతుంటారు. చిరు కూడా మహేష్ ను ఫాలో అవుతూ ట్రిప్స్ వేస్తున్నారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కానీ 90లలోనే చిరంజీవి వేసవి నుంచి తప్పించుకోవడానికి విదేశాలకు వెళ్లేవారు. ఆయనొక్కడే కాకుండా ఫ్యామిలీని కూడా తీసుకెళ్లి సమ్మర్ వెకేషన్ ను ఫుల్లుగా ఎంజాయ్ చేసేవారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X