Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Swag of Bhola: మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే సర్‌ప్రైజ్ రెడీ.. ఎలా ఉంటుందంటే?
మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో మాస్ ఎలివేషన్స్ పవర్ఫుల్ గా ఉండాల్సిందే. అభిమానులకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ వెళ్తున్న మెగాస్టార్ రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆచార్య సినిమాపై అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ తేజ్ కూడా ఆ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ కథానాయికలుగా నటించిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత సినిమాపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్లో రాబోతున్న బోళా శంకర్ సినిమా పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. గతంలో ఈ దర్శకుడు వరుసగా డిజాస్టర్స్ ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈసారి మెగాస్టార్ కోసం మాత్రం మంచి సినిమాని ప్రేక్షకులకు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా అతన్ని నమ్మడు అంటే తప్పకుండా సినిమాలో మంచి కంటెంట్ ఏదో ఉంది అని అర్థం అవుతుంది. అంతేకాకుండా మెహర్ రమేష్ రీమేక్ సినిమాల విషయంలో దాదాపుగా సక్సెస్ సాధించింది ఎక్కువ.

అందుకే వేదళం సినిమాను బోలా శంకర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన అప్డేట్ అందించారు. న్యూ ఇయర్ సందర్భంగా శనివారం రోజు ఉదయం 9 గంటలకు మెగాస్టార్ కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన లుక్ ను విడుదల చేయబోతున్నారు. మెగాస్టార్ స్వాగ్ ఆఫ్ బోళా లుక్ రాబోతున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్యాగ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
తప్పకుండా సినిమా అంతకుమించి అనేలా ఉంటుంది అని మెగాస్టార్ అయితే చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక సినిమాలో మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక తమన్నా భాటియా హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు క్లారిటీ కూడా ఇచ్చేశారు. సిస్టర్ సెంటిమెంట్ చూపిస్తూనే మరోవైపు మాస్ యాక్షన్ ఎలివేషన్స్ తో మెగాస్టార్ సరికొత్తగా కనిపించబోతున్నట్లు గా అర్థం అవుతోంది. ఇక సినిమా షూటింగ్ ను కూడా శరవేగంగా కొనసాగిస్తున్నారు
వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ అనంతరం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక మెగాస్టార్ లైనప్ లో గాడ్ ఫాదర్ సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో, వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో రెండు సినిమాలు చేయడానికి కమిట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళతోనే కాకుండా అలాగే మారుతి, గోపీచంద్ మలినేని, సంపత్ నంది వంటి కమర్షియల్ దర్శకులతో కూడా ఫ్యూచర్ లో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ఎక్కువగా యువ దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అర్ధమవుతోంది.