Bholaa Shankar: రూమర్స్ కు చెక్ పెడుతూ అదిరిపోయే అప్డేట్.. రంగంలోకి మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమాలతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకోవాలి అని సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం లైనప్ లో ఉన్న సినిమాలపై ప్రేక్షకులలో అయితే మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా బోళా శంకర్ సినిమాపై కూడా మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.
మెహర్ రమేష్ కూడా ఈ సినిమాతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తున్నడు పర్ఫెక్ట్ ప్లానింగ్తో పవర్ఫుల్ స్క్రిప్ట్ తో ఈ సినిమాను అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా రెడీ చేస్తున్నాడు. అయితే బోళా శంకర్ సినిమా షూటింగ్ ఆగిపోయింది అని మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ స్టార్ట్ చేసే ఆలోచనలో లేనట్లే అని ఇటీవల కొన్ని రూమర్లు జనాలను కన్ఫ్యూజన్ కు గురి చేశాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని మరోసారి చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ వచ్చేసింది. సినిమాను మళ్ళీ ఎప్పటిలానే షూటింగ్ ను కంటిన్యూ చేయబోతున్నట్లు వివరణ ఇచ్చారు.

ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాలను పూర్తి చేసిన చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్ లో కూడా మెగాస్టార్ కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 21 స్టార్ట్ చేయబోయే షెడ్యూల్లో మెగాస్టార్ తో చిరంజీవితో పాటు తమన్నా పాల్గొనబోతున్నారట. అందుకు సంబంధించిన పూర్తి ప్రణాళికలతో కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా తమన్నా భాటియా నటిస్తుండగా మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి త్వరలోనే ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా అనంతరం బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే మరొక కొత్త సినిమాతో బిజీ కానున్నాడు. అలాగే లైనప్ లో వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ కూడా మధ్యలో ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదు అని వెంకీ కుడుముల ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











