HanuMan: హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి తప్పిదం... గుర్తించిన నెటిజన్లు!
సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో హనుమాన్ చిత్రం ఒకటి. ఇక ఈ చిత్రం యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం కాంబోలో వచ్చింది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంటుకు చిరంజీవి చీఫ్ గెస్టుగా వచ్చారు. ఆయన ఇప్పుడు కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Recommended Video

ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'హనుమాన్' సినిమా ఒకటి. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన మోస్ట్ అవైటెడ్ చిత్రం ఇది. ఇక ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ.. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇక ఈ వేడుకకు సినిమా హీరో, హీరోయిన్లు, డైరెక్టర్, ప్రోడ్యూసర్, చిత్ర నటినటులు హాజరు కాగా.. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు అయ్యారు.
ఇక ఈ ఈవెంటుకు వచ్చి.. చిరంజీవి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఈవెంటుకు స్టేజీ మీదకు వచ్చే ప్రతి ఒక్కరు చెప్పులు విడిచి హాజరు అయ్యారు. అయితే చిరంజీవి మాత్రం చెప్పులు వేసుకుని స్జేజీ మీదకు వచ్చారు. దీంతో హనుమంతుడు భక్తుడు అయినటు వంటి చిరంజీవి.. ఇలా చెప్పులు ధరించి రావడం హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చిరంజీవి ఎందుకు ఇలా వచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ ఈవెంట్ మొదట్లో సుమ మాట్లాడుతూ.. ఈరోజు ఈవెంట్లో ఎవరు చెప్పులు ధరించడం లేదుఅని చెప్పుకువచ్చింది. ఆమె చెప్పినట్లుగానే స్టేజీ మీదకు వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పులు విప్పి వచ్చి మాట్లాడారు. అయితే మొదటి నుంచి హనుమాన్ భక్తుడుగా చెప్పుకునే చిరంజీవి మాత్రం చెప్పులు ధరించి స్పీచ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయం మాత్రం నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే... తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా నటించిన చిత్రం 'హను - మాన్' చిత్రానికిి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి ఏఐ ఉంటుందని టాక్ వినిపిస్తుంది చూడాలి మరి.


Click it and Unblock the Notifications











