Kaikala Satyanarayana పుట్టినరోజున మెగాస్టార్ సర్‌ప్రైజ్ విజిట్.. బెడ్‌పైనే కేక్ కట్ చేయించిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి కేవలం సినిమాల పరంగానే కాకుండా ఇతర మంచి కార్యక్రమంలో కూడా నిత్యం పాల్గొంటూ ఉంటారు. తన వరకు ఏదైనా మంచి జరుగుతోంది అంటే తప్పకుండా అండగా ఉండేందుకు ఇష్టపడతారు. ఇక సీనియర్ నటీనటులను కూడా ఆయన ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. గతంలో చాలామంది సినీ ప్రముఖుల ఆరోగ్యాల విషయంలో కూడా ఆయన ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని వారికి అండగా కూడా నిలిచారు. అవసరమైన సమయంలో ఆర్థికంగా కూడా సహాయం చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండడం కరెక్ట్ అని చాలామంది సినీ ప్రముఖులు కూడా వివరణ ఇచ్చారు.
ఇక తెలుగు చత్ర పరిశ్రమలో ఎనలేని గుర్తింపు అందుకున్న కైకాల సత్యనారాయణ 87వ పుట్టినరోజును మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడం విశేషం. ఆ మహానటుడే గురించి అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో నెగిటివ్ పాజిటివ్ పాత్రలతో అలాగే కామెడీ పాత్రలతో కూడా మంచి క్రేజ్ అందుకున్న కైకల సత్యనారాయణ మెగాస్టార్ చిరంజీవితో కూడా చాలా సినిమాలు చేశారు. వీరి ఇద్దరికీ మంచి సోదరా భావం కూడా ఉంది. ఇక చాలా కాలంగా కైకాల సత్యనారాయణ సినిమాలు చేయడం తగ్గించేశారు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆ సీనియర్ నటుడికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా ఆయన బెడ్ పైనే కొంత ఆస్వస్థత ఉండడంతో అక్కడే మెగాస్టార్ తన చేతుల మీదుగా కేక్ కూడా కట్ చేయించారు. ఇక మెగాస్టార్ వచ్చిన సందర్భంగా కైకల సత్యనారాయణ కూడా ఆ సమయంలో ఎంతగానో ఆనందించారు. అలాగే సోషల్ మీడియాలో ప్రత్యేకంగా స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంటూ ఈ విధంగా వివరణ ఇచ్చారు. 'పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున, వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను' అని మెగాస్టార్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











