మా ఇంటికి మహాలక్ష్మి… హ్యాపీ మూడ్ లో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలోకి మరో కొత్త జెనరేషన్ కిడ్ ఎంట్రీ ఇచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకి కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై మెగా అభిమానులు, సినీ ఇండస్ట్రీ నుంచి సెలబ్రిటీలు అందరూ కూడా రామ్ చరణ్ కి విషెస్ చెబుతున్నారు. మెగా ఫ్యామిలీలో కూడా అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక అర్ధరాత్రి ఉపాసన ఆడపిల్లకి జన్మనిచ్చింది.

ఇక మనవరాలుని చూసేందుకు అపోలో హాస్పిటల్ కి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మెగాస్టార్ చిరంజీవి తన ఆనందం పంచుకున్నారు. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని, ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని మెగాస్టార్ అన్నారు. చాలా ఏళ్ల నుంచి మేము ఈ ఘడియల కోసం ఎదురుచూస్తున్నాం. రామ్ చరణ్, ఉపాసన పిల్లలతో ఆదుకోవాలని, తాత అనిపించుకోవాలని ఆశపడుతున్నా. ఇన్నాళ్ళకి కోరిక తీరింది.

Megastar chiranjeevi clarification on New grand daughter entry

మంగళవారం మంచి ఘడియలలో పాప పుట్టిందని అంటున్నారు. ఆ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాం. ఆ ప్రభావం కూడా ముందే చూపిస్తుంది. చరణ్ ఎదుగుదల, ఎచీవ్ మెంట్స్, వరుణ్ తేజ్ నిశ్చితార్ధం ఇలా అన్ని శుభ విశేషాలే జరుగుతున్నాయి. దీనిని బట్టి ఆ ప్రభావం ఉందనే అనిపిస్తోంది అంటూ మెగాస్టార్ తన ఆనందాన్ని పంచుకున్నారు.

చరణ్ తండ్రి అయిన సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో శ్రేయోభిలాషులు, బంధువులు, మిత్రులు, చిత్ర పరిశ్రమ నుంచి చాలా మంది వారి విషెస్ ని అందిస్తున్నారు. అలాగే మా వెన్నంటే ఉండే అభిమానులు కూడా వారి ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు.

పాపకి ఎవరి పోలికలు ఉన్నాయని విలేకరి అడగగా, అది తరువాత తెలుస్తుంది. ఇప్పుడే చెప్పలేం అని మెగాస్టార్ చిరంజీవి అక్కడి నుంచి హాస్పిటల్ లోకి వెళ్ళిపోయారు. మొత్తానికి కుటుంబంలోకి వారసురాలు రావడంతో మెగాస్టార్ చిరంజీవి చాలా ఆనందంతో ఉన్నారని మాత్రం అర్ధమవుతోంది. ఇక మెగా ఫ్యామిలీలో అందరూ కూడా అపోలో హాస్పిటల్ కి చేరుకొని రామ్ చరణ్, ఉపాసనని కలుసుకొని వారి సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి వస్తూ ఉండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X