ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పాత్ర పవన కళ్యాణ్ చేసి ఉంటే.. చిరంజీవి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్!
మెగా మల్టీస్టారర్ మూవీ ఆచార్య సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం గత ఏడాది నుంచి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు మరో మూడు రోజుల్లో ఒక సరికొత్త ఫెస్టివల్ మొదలుకానుంది అని చెప్పవచ్చు. ఇక మొన్నటి వరకు ఈ సినిమా ప్రమోషన్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు అంతగా హైప్ క్రియేట్ చేయడం లేదు అనే కామెంట్స్ కు ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి మెగా టీమ్ అసలైన బజ్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక నేడు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ పాత్రను పవన్ కళ్యాణ్ చేసి ఉంటే ఎలా ఉండేది.. అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

స్పెషల్ ప్రెస్ మీట్
ఇటీవల నిర్వహించిన ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏ స్థాయిలో గుర్తింపు లభించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో అయితే చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా చాలా బిజీగా పాల్గొంటున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న మెగాహీరోలు నేడు ప్రత్యేకంగా తెలుగు మీడియా తో ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు.

సిద్దా పాత్ర కోసం..
మీడియా సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ అలాగే కొరటాల శివ కూడా చాలా పాజిటివ్ గా స్పందిస్తూ సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా రామ్ చరణ్ సిద్ధక్ పాత్రలో ముందుగా ఎవరిని అనుకున్నారు అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఆ వివరాలపై కూడా దర్శకుడు కొరటాల శివ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.

చరణ్ పాత్రలో మహేష్ బాబు?
ముందుగా మహేష్ బాబును సిద్ధ పాత్ర కోసం అనుకున్నట్లుగా చాలా వార్తలు వచ్చాయి. ఐతే అందులో ఎలాంటి నిజం లేదని కూడా కొరటాల శివ వివరణ ఇచ్చాడు. మొదట ఈ పాత్ర కోసం డైరెక్ట్ గా రామ్ చరణ్ అయితేనే బెటర్ గా ఉంటుంది అని తండ్రీ కొడుకుల మధ్య ఉండే రియల్ ఎమోషన్ సినిమాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనే ఆలోచనతోనే రామ్ చరణ్ ను సెలక్ట్ చేసుకున్నట్లు దర్శకుడు వివరణ ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ చేసి ఉంటే..
ఇక ప్రెస్ మీట్ లో అలాంటి మరో ప్రశ్నకు కూడా మెగాస్టార్ చిరంజీవి కూల్ గా సమాధానమిచ్చారు. సిద్ధ పాత్రలో పవన్ కళ్యాణ్ ఉండి ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా అనే ప్రశ్నకు మెగాస్టార్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. సిద్ధ పాత్రలో ఎవరిని సెలెక్ట్ చేసుకున్న చాలా బాగా నటిస్తారు అని చెప్పగలను అంటూ.. కానీ చరణ్ అయితేనే ఆ ఫీల్ ఎక్కువగా ఉంటుంది అని అనిపించిందని అన్నారు.

పర్ఫెవ్ట్ గా ఉండేది..
ఒకవేళ రామ్ చరణ్ తేజ్ అందుబాటులో లేక పోయి ఉంటే మాత్రం ఆ పాత్రకు తప్పకుండా ఆల్టర్నేటివ్ గా పవన్ కళ్యాణ్ మాత్రమే పర్ఫెక్ట్ అని చెప్పగలను అని మెగాస్టార్ బలంగా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ సిద్దా అనే ఆ స్థానంలో ఉండి ఉంటే నాకు అదే ఫీలింగ్ కలిగేదని.. కానీ అంత వరకు ఛాన్స్ తీసుకోలేదని అంతకుముందే చరణ్ రోల్ కుదిరింది అని మెగాస్టార్ నవ్వుతూ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











