NTR ఇచ్చిన సలహా.. నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతుంది.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

తెలుగు పరిశ్రమలో ఒకప్పడి లెజండరీ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలు విశాఖ పట్నంలో గ్రాండ్ గా జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. అక్కడ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఇచ్చిన సలహా వల్లే తాను, తన కుటుంబం హ్యాపీగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు వచ్చే రెమ్యూనరేషన్ సరిపోవడం లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ట

విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీనియర్ ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఎన్టీఆర్, ఏఎన్నార్ గార్లతో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టారు. వారిగురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.

Megastar Chiranjeevi comments about Senior NTR Advice in His Career Beginning Full Details Here

ఎన్టీ రామారావు గారు దూర దృష్టితో ఆలోచించి నాకు సలహాలు ఇచ్చారంటూ ఓ విషయాన్ని బయటపెట్టారు. కారులు కొందాం అనుకుంటే భూములు మీద పెట్టుబడి పెట్టండి బ్రదర్ అని ఎన్టీఆర్ సలహా ఇచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి చెప్పుకువచ్చారు. ఈరోజు నా రెమ్యూనరేషన్ కంటే ఆ స్థలాలే నన్ను.... నా కుటుంబాన్ని కాపాడుతున్నాయ్ అంటూ తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ... తాను కెరీర్ లో అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజుల్లో.... ఒక రోజు ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్లాను. అక్కడ ఎన్టీఆర్ రండి బ్రదర్ కూర్చోండి అన్నారు. భయంగా అక్కడే కూర్చున్నాను. అప్పుడు ఆయన ఓ మాట నాతో చెప్పారు. అప్పటి వరకు కార్లు కొందామా అనుకుంటున్న సమయంలో బ్రదర్ మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు. ఈ సంపాదించిన సంపాద ఇనుప ముక్కల మీద పెట్టొద్దు అంటూ సలహా ఇచ్చారు.

ఏదైనా హౌస్ కొనుక్కోండి.. లేదా స్థలాలు కొనుక్కోండి అంటూ ముందస్తు చూపుతో సలహా ఇచ్చారు. అప్పటిదాకా నేను మంచి కారు కొనుక్కుందామా, స్టైలిష్ టయోటా కారు కొనుక్కుందామా అనుకునే వాడిని.. ఎన్టీఆర్ గారు చెప్పిన తర్వాత ఆ కార్ కొనడం ఆపేసి అక్కడక్కడా స్థలాలు కొనడం స్టార్ట్ చేశాను. ఈ రోజు నా రెమ్యునరేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను, నా ఫ్యామిలీని కాపాడుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Megastar Chiranjeevi comments about Senior NTR Advice in His Career Beginning Full Details Here

ఇక ఇదే కార్యక్రమంలో తన బయోగ్రఫీ గురించి వెల్లడించారు చిరంజీవి. తన బయోగ్రఫీ రాసే బాధ్యతను రచయిత, డైరెక్టర్ యండమూరి వీరేంద్ర నాథ్ కు అప్పగించినట్లు తెలిపారు. తనకు తన బయోగ్రఫీ రాసే టైం లేదని.. అందుకే యండమూరికి అప్పగించినట్లు వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X