ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీ వియోగం.. చిరంజీవి దిగ్రాంతి.. ఫిలిం క్రిటిక్స్ సంతాపం
ప్రముఖ దిన పత్రిక ఆంధ్రజ్యోతి, టెలివిజన్ ఛానెల్ ఏబీఎన్ సంస్థల ఎండీ, జర్నలిస్ట్, సంపాదకులు శ్రీ వేమూరి రాధాకృష్ణకు విషాద సంఘటన ఎదురైంది. ఆయన సతీమణి శ్రీమతి కనకదుర్గ అనారోగ్యంతో బాధపడుతూ ఏప్రిల్ 26వ తేదీన తుదిశ్వాస విడిచారు. సతీవియోగంతో బాధపడుతున్న వేమూరి రాధాకృష్ణకు సినీ, రాజకీయ, పాత్రికేయ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఫోన్‌లో, వ్యక్తిగతం కలిసి పరామర్శించారు.
ఈ విషాద సంఘటనపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. వేమూరి రాధాకృష్ణ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ప్రకటనను విడుదల చేశారు. శ్రీ వేమూరి రాధాకృష్ణ సతీమణి శ్రీమతి కనకదుర్గ తుదిశ్వాస విడిచారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. జీవిత భాగస్వామికి నిజమైన నిర్వచనంగా మీ ప్రతి అడుగులో అడుగైన కనకదుర్గ అకాల మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ దుఃఖ సమయంలో మీరు తట్టుకొనే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ, మీ కుటుంబమంతటికీ నా సంతాపం తెలియజేసుకుంటున్నాను అని చిరంజీవి సంతాప ప్రకటనలో తెలిపారు.

ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సంతాపం
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి శ్రీమతి కనకదుర్గ అనారోగ్యంతో మరణించారన్న వార్త దిగ్భ్రాంతి కలిగించింది. శ్రీమతి కనకదుర్గ మృతికి ప్రగాఢ సంతాపాన్ని, రాధాకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ విషాదాన్ని తట్టుకొనే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము అని ఫిలిం క్రిటిక్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











