నిహారిక కోసం మెగాస్టార్ 2కోట్ల విలువైన కానుక.. ఆ సలహా ఎవరిదంటే..

మెగాస్టార్ చిరంజీవి సాధారణంగా బయటకు వస్తే సింపుల్ గానే ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. ఎక్కడైనా వేడుకలకు వెళితే మెగాస్టార్ గా ఎంతగానో క్రేజ్ అందుకుంటారు. అయితే ఫ్యామిలీ విషయంలోకి వస్తే మాత్రం ఆయన చాలా సింపుల్ గా ఉంటారనేది అందరికి తెలిసిందే. కొడుకులతో కుతుళ్ళతో ఎంత సరదాగా ఉంటారో అలాగే మనవాళ్ళు, మనవరాళ్లతో కూడా అంతే సరదాగా ఉంటారు. ఇక నిహారికతో మెగాస్టార్ కు స్పెషల్ బాండింగ్ ఉందనే చెప్పాలి. నిహారిక పెళ్లి సందర్భంగా మెగాస్టార్ దంపతులు విలువైన ఒక బహుమతిని అందించారు.

తమ్ముడి కూతురు అయినప్పటికీ..

తమ్ముడి కూతురు అయినప్పటికీ..

నిహారిక పెళ్లి నిశ్చయమైనప్పటి నుంచి కూడా మెగాస్టార్ అన్ని పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తమ్ముడి కూతురు అయినప్పటికీ సొంత కుతురు అనే భవనతోనే చూస్తారు. మెగా హీరోలు అంత క్రమశిక్షణతో ఉండడానికి గల కారణం ఒక విధంగా మెగాస్టార్ నేర్పిన అడుగులనే చెప్పాలి. ఇక నిహారిక పెళ్లి విషయంలో నాగబాబు పెళ్లి పెద్దగా మెగాస్టార్ ను ముందు ఉంచారు.

పెళ్లి కోసం రూ.2కోట్ల విలువైన కనుక

పెళ్లి కోసం రూ.2కోట్ల విలువైన కనుక

నీహారికకు కూడా పెదనాన్న అంటే ఎంతో ఇష్టం. మెగాస్టార్ ను ఆమె నాన్న అనే పిలుస్తోంది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఇద్దరి మధ్య ఆప్యాయత ఎలా ఉందో. అసలు మ్యాటర్ లోకి వస్తే నిహారికకు పెళ్లికి కానుకలు ఎన్ని వచ్చినా కూడా మెగాస్టార్ ఇచ్చిన కానుక మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఎందుకంటే దాని విలువ 2కోట్ల రూపాయలు. మెగాస్టార్ ఇచ్చిన కానుక గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

ఇక నిహారికను పెళ్లి కూతురిని చేసిన సమయంలో మెగాస్టార్ ఇంటి పెద్దగా కూతురిని ఆశీర్వదించారు. సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా చేయగా అది వైరల్ అవుతోంది. నిహారిక చిన్నప్పటి ఫొటోను అలాగే నిన్న పెళ్లి కుతురిగా రెడీ అయిన ఫొటోను జత చేసి పోస్ట్ చేసిన మెగాస్టార్ చైతన్య చేతిలో పెడుతున్నట్లు వివరణ ఇచ్చారు. మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకునాశుభాకాంక్షలు, ఆశీస్సులు.. అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

Recommended Video

Niharika Konidela wedding : All Mega Heroes In one Frame
 ఆ కానుక ఏమిటంటే..

ఆ కానుక ఏమిటంటే..

ఇక మెగాస్టార్ ఇచ్చిన కానుక విషయానికి వస్తే.. నిహారికను ఇటీవల పెళ్లి కూతురిని చేసే సమయంలో మెగాస్టార్ చిరంజీవి రూ.2కోట్లు విలువ చేసే నెక్లెస్ ను కానుకగా ఇచ్చారట. ఆ నెక్లెస్ ను ఆయన సతీమణి సురేఖ సలహా మేరకు స్పెషల్ గా డిజైన్ చేయించిన్నట్లు తెలుస్తోంది. సతీసమేతంగా పెళ్లి కూతురిని చేసే సమయంలో నిహరికకు బహుకరించారు. అందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X