నీ సోలో బతుకు ఇంకా కొన్ని రోజులే.. మేనల్లుడికి మెగాస్టార్ డిఫరెంట్ విషెస్

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పుటి నుంచి అభిమానులకు అప్పుడప్పుడు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ని కలిగిస్తున్నాడు. ఓ వైపు సందేశాలు, జాగ్రత్తలు చెబుతూనే మరోవైపు తనదైన శైలిలో కామెడీ పంచ్ లు కౌంటర్లు వేస్తున్నారు. ఇక నేడు తన ముద్దుల మేనల్లుడి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ శుభాకాంక్షలు చెప్పిన విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అందుకు సాయి ధరమ్ తేజ్ కూడా ఫుల్ ఖుషి అయ్యాడు.

ఏదైనా సరే మామయ్యకు చెప్పాల్సిందే..

ఏదైనా సరే మామయ్యకు చెప్పాల్సిందే..

మెగాస్టార్ చిరంజీవికి సాయి ధరమ్ తేజ్ అంటే చాలా ఇష్టమని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదటి సినిమా నుంచి కూడా సాయి తన మామయ్యకు చెప్పకుండా ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యంగా సినిమాల కథల విషయంలో ఏ మాత్రం అనుమానం ఉన్నా మెగాస్టార్ దగ్గరకు వెళ్లాల్సిందే. ఇక చాలా వరకు చిరు పాటలను రీమిక్స్ చేస్తూ అదిరిపోయే స్టెప్పులతో తగిన న్యాయం చేశాడనే చెప్పాలి.

హ్యాపీగా ఎంజాయ్ చెయ్

హ్యాపీగా ఎంజాయ్ చెయ్

ఇక నేడు ఈ మేనల్లుడి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ అందించిన విషెస్ అభిమానులను సైతం ఆకట్టుకుంటున్నాయి. హ్యాపీ బర్త్ డే డియర్ సాయి ధరమ్ తేజ్. ఇంకా నువ్వు సోలోగానే ఉన్నావు. ఈ సోలో బ్రతుకు నీకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే. అందుకే హ్యాపీగా ఎంజాయ్ చెయ్.. అంటూ మెగాస్టార్ ట్విట్టర్ ద్వారా చాలా సరదాగా తన విషెస్ అందించారు.

పెళ్లి విషయంపై కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు

పెళ్లి విషయంపై కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు

అంతే కాకుండా మెగాస్టార్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు చెందిన అమృత అనే సాంగ్ ని కూడా విడుదల చేశారు. థమన్ స్వరపరిచిన ఆ సాంగ్ సంగీత ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సాంగ్ విడుదల చేస్తూనే. మెగాస్టార్ ఇన్ డైరెక్ట్ గా మేనల్లుడి పెళ్లి విషయంపై కూడా ఒక క్లారిటీ ఇచ్చారనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా సాయి ధరమ్ తేజ్ పెళ్లికి సంబంధించిన రూమర్స్ ఏ స్థాయిలో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

Recommended Video

Sai dharam Tej Marriage Is Expected In 2021 Summer
ఇదే నాకు బెస్ట్ గిఫ్ట్..

ఇదే నాకు బెస్ట్ గిఫ్ట్..

అయితే రూమర్స్ ఎన్ని వచ్చిన పెళ్లి విషయంపై ఇన్ని రోజులు సైలెంట్ గానే ఉన్నారు. ఇక ఫైనల్ గా మెగాస్టార్ మేనల్లుడి సోలో బ్రతుకు ఇంకా కొన్ని రోజులే అని చెప్పడంతో పెళ్లి చేయడానికి రెడీ అయినట్లు అర్ధమయ్యింది. ఇక మెగాస్టార్ అందించిన విషెస్ కి సాయి ధరమ్ తేజ్ ఎంతగానో ఉప్పొంగిపోయాడు. ఎవరైనా అడిగితే ఇదే నాకు బెస్ట్ గిఫ్ట్ అని చెబుతాను. చాలా కృతజ్ఞతలు మామా. లవ్యూ సో మచ్. నీ బ్లెస్సింగ్స్ కంటే ముఖ్యమైనవి నాకు మరొకటి అవసరం లేదు.. అంటూ సుప్రీమ్ హీరో వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X