Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్.. తన జీవితాన్ని మార్చేసింది ఆ సినిమానేనట!

టాలీవుడ్ టాప్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అందం, అభినయంతో పాటు డ్యాన్సుకు, మేనరిజానికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఆయనను అన్నయ్యా, అన్నయ్యా అని పిలుచుకునే అభిమానులు.. చిరు చిత్రాల కోసం తెగ ఆసక్తిగా వేచి చూస్తుంటారు. అందుకే వయసు పెరిగినా ఏమాత్రం పట్టించుకోకుండా ఫ్యాన్స్ కోసం అనేక సినిమాలు చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సైరా, ఆచార్య సినిమాల కోసం నాలుగేళ్ల దాకా టైం తీసుకున్నారు.

ఆ తర్వాత స్పీడు పెంచిన మెగాస్టార్.. నాలుగు నెలల వ్యవధిలోనే రెండు చిత్రాలను విడుదల చేశారు. ఇందులో వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్టు కాగా... గాడ్ ఫాదర్ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇటీవలే విడుదల అయిన భోళా శంకర్ సినిమాను కూడా థియేటర్ల వద్దగా ఆడలేకపోయింది. అయినా మెగాస్టార్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా చిత్రాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉండే ఆయన మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలానే యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తుంటారు.

Megastar Chiranjeevi Emotional Tweet on Khaidi Movie

అయితే తాజాగా ఎక్స్ వేదికగా మెగాస్టార్ ఓ పోస్ట్ చేశారు. అందులో చాలా ఎమోషనల్ అవుతూ తన గురించి చెప్పుకొచ్చారు. 1983లో విడుదలైన ఖైదీ చిత్రం.. ఈరోజుటితో 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిరంజీవి ఈ విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ.. 'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో తనను శాశ్వత 'ఖైదీ'ని చేసిందని చెప్పుకొచ్చారు. తన జీవితంలో ఖైదీ సినిమా ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ అని వివరించారు. అలాగే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరును ఎప్పటికీ మరిచిపోలేనని వెల్లడించారు.

Megastar Chiranjeevi Emotional Tweet on Khaidi Movie

ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలు అవుతుందని.. ఆ సందర్భంగా ఒక సారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నట్లు చిరంజీవి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఖైదీ సినిమా దర్శకులు ఎ.కోదండ రామిరెడ్డిని, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్ ని, రచయితలు పరుచూరి సోదరులను, తనతో పాటు నటించిన సుమలత, మాధవిలని అభినందినస్తున్న ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంత గొప్ప విజయాన్ని తనతోపాటు తన టీంకు అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ తన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Megastar Chiranjeevi Emotional Tweet on Khaidi Movie

మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మెగా అభిమానులు అంతా కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంత గొప్ప సినిమాను చూసేలా చేసినందుకు థాంక్స్ అంటూ చెప్పుకొస్తున్నారు. 1982లో విడుదల అయిన ఫస్ట్ బ్లడ్ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా డైరెక్టర్ కోదండ రామిరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లును సాధించి సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. తెలుగులో తీసిన ఈ చిత్రాన్ని ఆ తర్వాత హిందీతో పాటు కన్నడలోనూ రీమేక్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X