మా చేతిలో పెరిగిన చిన్నారి నిహారికని, నీ చేతిలో పెడుతున్నా.. చిన్నప్పటి ఫొటోతో చిరు ఎమోషనల్

మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులపట్ల ఎంత బాధ్యతగా ఉంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బయట ఎన్ని పుకార్లు వచ్చినా కూడా ఏనాడు కలత చెందలేదు. పరిణామాలు ఎలా ఉన్నా కూడా తామంతా ఒక్కటే అన్నట్లుగా ఆప్యాయంగా ఉంటూ క్లారిటీ ఇచ్చేవారు. ఇక నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి వేడుక సందర్భంగా మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్ తో ఆడియెన్స్ ని మరింతగా ఆకట్టుకున్నారు. నిహారిక చిన్నప్పటి ఫొటోను కూడా షేర్ చేశారు.

Recommended Video

Niharika Konidela wedding Saree Speciality
మెగాస్టార్ నిహారిక బంధం..

మెగాస్టార్ నిహారిక బంధం..

నిహారిక నాగబాబు కూతురు అయినప్పటికీ చిరంజీవిని నాన్న అనే పిలుస్తుంది. పిల్లల విషయంలో మెగాస్టార్ నిత్యం ఒక తండ్రి లాగే మేలుగుతూ అందరిని సమానంగా చూసేవారు. ఇక ఏదైనా వేడుకలు జరిగితే అన్నయ్య పెద్దగా వ్యవహరించాల్సిందే. ఏ పని చేసినా కూడా ముందుగా మెగాస్టార్ ను అడిగి ముందుకు సాగడం నాగబాబుకు ముందు నుంచి అలవాటుగా మారింది.

మొదలైన పెళ్లి వేడుకలు

మొదలైన పెళ్లి వేడుకలు

ఇక ఇప్పుడు నిహారిక పెళ్లి విషయంలో కూడా ముందుగా మెగాస్టార్ నిర్ణయం ద్వారానే రాజస్థాన్ లో పెళ్లి చేస్తున్నారు. ఇక సోమవారం నుంచే పెళ్లి వేడుకకు సంబంధించిన ఈవెంట్స్ మొదలయ్యాయి. మెగాస్టార్ ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లో ఉదయ్ పూర్ ప్యాలెస్ కు చేరుకున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వేడుకను నిర్వహించనున్నారు.

నిహారిక చిన్నప్పటి ఫొటోతో మెగాస్టార్ ఎమోషనల్

నిహారిక చిన్నప్పటి ఫొటోతో మెగాస్టార్ ఎమోషనల్

ఇక నిహారికను పెళ్లి కూతురిని చేసిన సమయంలో మెగాస్టార్ ఇంటి పెద్దగా కూతురిని ఆశీర్వదించారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా చేయగా అది వైరల్ అవుతోంది. నిహారిక చిన్నప్పటి ఫొటోను అలాగే నిన్న పెళ్లి కుతురిగా రెడీ అయిన ఫొటోను జత చేసి పోస్ట్ చేసిన మెగాస్టార్ చైతన్య చేతిలో పెడుతున్నట్లు వివరణ ఇచ్చారు.

మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో..

మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో..

మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు, ఆశీస్సులు.. అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసిన విధానం అభిమానులను కూడా ఎమోషనల్ గా టచ్ చేసింది. ఇక రేపు ప్యాలెస్ లో నిహారిక మెడలో చైతన్య హిందు సాంప్రదాయం ప్రకారం మూడు ముళ్ళు వేయబోతున్నాడు. ఈ వేడుకకు పలువురు రాజకీయ నేతలతో పాటు స్టార్ సెలబ్రెటీలు రానున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X