twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Krishnam Raju No More: హీరో అంటే ఇలా ఉండాలి అనుకున్నా.. అసలైన రాజసం: చిరంజీవి ఎమోషనల్

    |

    టాలీవుడ్ సీనియర్ నటుడు 'రెబల్ స్టార్' కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇక హాస్పిటల్ నుంచి ఆయన పార్థివదేహాన్ని స్వగృహనికి తీసుకురాగా అక్కడ పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కృష్ణంరాజు మరణవార్త అందగానే వెంటనే వారి స్వగృహానికి చేరుకొని సంతాపం తెలియజేశారు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడి ఆయనతో ఉన్న అనుబంధం గుర్తుచేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    ఇది చాలా చాలా విషాధకరం

    ఇది చాలా చాలా విషాధకరం

    మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. కృష్ణంరాజు గారు లేరన్న మాటను జీర్ణించుకోలేకపోతున్నాము. ఈ మధ్య కాలంలో కాస్త నలతగా ఉంటుంది. అస్వస్థతతో ఆయన హాస్పిటల్ కు వెళుతున్నారు. మళ్ళీ ఆయన వెనక్కి తిరిగి వస్తారు. మళ్ళీ ఒకసారి హాస్పిటల్ కు వెళ్లారు. మళ్ళీ వెనక్కి వచ్చారు.. అని తెలిసింది. అయితే ఈసారి వెళ్ళాక మళ్ళీ రాలేని పరిస్థితి వచ్చింది అన్నప్పుడు అస్సలు నమ్మలేకపోయాము. ఇది ఇది చాలా చాలా విషాధకరం.. అని చిరంజీవి అన్నారు.

    హీరో అంటే ఇలా ఉండాలి

    హీరో అంటే ఇలా ఉండాలి

    నేను చిన్నతనంలో చదువుకుంటున్న రోజుల్లో ఆయన చిలకా గోరింక సినిమా చూశాము. ఆ సమయంలో మొగల్తూరు వచ్చినప్పుడు ఆయనను మొదటిసారి చూడడానికి ఎగబడిన వారిలో నేను ఒకడిని. అలా చూసినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది. అలాగే హీరో అంటే ఇలా ఉండాలి అని అలా చూస్తూనే ఉండిపోయాను. ఇంకా ఆ దృశ్యం అప్పుడు కనిపించిన విధానం ఆ విగ్రహం నాకు ఇంకా అలానే కనబడుతోంది.. అని అన్నారు.

    ఒక రాజసం కనిపించేది

    ఒక రాజసం కనిపించేది

    అలాగే చాలా సందర్భాలలో చాలా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మనవూరి పాండవులు సినిమా ఆయనతో చేసినప్పుడు ఎంతో ఎంకరేజ్ చేశారు. భోజనం చేస్తున్నప్పుడు కూడా అందరిని పిలిచే వారు. దగ్గరుండి తినిపించేవారు. బ్రేక్ టైమ్ లో కూడా ఎంతో స్నేహంగా ఉండేవారు. ఆయనలో ఒక రాజసం కనిపించేది. రావు గోపాల్ లాంటి ప్రముఖ నటులు కూడా ఆయనను రాజవారు అని పిలిచేవారు. ఆ పిలుపుకు ఆయన నిలువెత్తు నిదర్శనం.. అని చెప్పారు.

    ఆయన ఒక మహావృక్షం

    ఆయన ఒక మహావృక్షం

    కృష్ణంరాజు లాంటి గారు ఒక మహావృక్షం లాంటివారు. అలాంటి వ్యక్తి చిత్రపరిశ్రమలో లేకపోవడం తీరని లోటు. ఆయన రాజకీయాల్లో కూడా మంత్రిగా సేవలు అందించారు. ఉన్నన్ని రోజులు కూడా చాలమంచి కార్యక్రమాలు కూడా చేశారు. ఆ రకంగా పరిపూర్ణత జీవితాన్ని అనుభవించారు. అంతటి ఆత్మీయులు సోదరుడు అన్నయ్య కృష్ణంరాజుకి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే వారి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా ప్రభాస్ కు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. అని చిరంజీవి వివరణ ఇచ్చారు.

    English summary
    Megastar chiranjeevi emotional words about krishnam raju
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X