Indra: మెగాస్టార్ చిరంజీవి చెక్కు చెదరని రికార్డు.. ఆ విషయంలో ఇంద్రను కొట్టలేకపోయిన RRR, Pushpa 2

తెలుగు సినిమా గర్వించదగ్గ అతి కొద్ది మంది హీరోలు అనే కంటే నటుల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. తన 'స్వయం కృషి' తో పైకి వచ్చి తెలుగు రాష్ట్రాల అభిమానులకి 'అన్నయ్య' గా తాను నిలిచారు. ఇప్పటికీ కూడా ఎంతమంది దర్శకులు నటుల్లో పాన్ ఇండియా సినిమాని షేక్ చేస్తున్న వారు అంతా మెగాస్టార్ ని చూసి ప్రేరణ చెందిన వారే అత్యధికంగా ఉంటారని చెప్పడంలో ఖచ్చితంగా ఎలాంటి సందేహం లేదు.

అలా తన సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి ఒక చెరపలేని చరిత్రని తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర నమోదు చేయగా తన హవా ఏ రేంజ్ లో ఉంది అంటే తన కెరీర్ చేసిన ఇన్ని దశాబ్దాల కాలాలలో కూడా తన రికార్డులకు తిరుగు లేదు.. తన మార్కెట్ కి ఎదురు లేదు. ఇప్పటికీ ఉన్న యంగ్ జెనరేషన్ స్టార్స్ తో సమానంగా మార్కెట్ ఉన్న ఏకైక సీనియర్ హీరోగా మెగాస్టార్ నిలిచారు.

megastar chiranjeevi euphoria in telugu states with record footfalls from 2000

కాగా తాజాగా అసలు మెగాస్టార్ స్టామినా తన ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో ఉందో అనేది తెలుస్తుంది. ప్రస్తుతం సినీ వర్గాల్లో మన తెలుగు స్టేట్స్ లో అత్యధికంగా చూసిన సినిమాల తాలూకా ఫుట్ ఫాల్స్ కోసం కొన్ని వైరల్ గా మారాయి. కాగా గత 2000 ఏడాది నుంచి ఈ 2024 వరకు అత్యధికంగా ఫుట్ ఫాల్స్ నమోదు అయ్యిన సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు సంచలనంగా నిలిచాయని చెప్పాలి.

కాగా ఈ పాతికేళ్లలో అత్యధికంగా మన తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 సినిమా 3 కోట్ల 10 లక్షల ఫుట్ ఫాల్స్ తో నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. ఇక రెండో స్థానంలో మెగా వారసుడు ఇపుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన సంచలన ఇండస్ట్రీ హిట్ చిత్రం "మగధీర" 2 కోట్ల 60 లక్షల ఫుట్ ఫాల్స్ తో నిలిస్తే మూడో స్థానంలో బాహుబలి పార్ట్ 1, 2 కోట్ల ఫుట్ ఫాల్స్ ని సాధించింది.

కానీ నాలుగో స్థానంలో 'ఇంద్ర'సేనుడిగా మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. కాగా దీని తర్వాత సెన్సేషనల్ సినిమా RRR నిలవడం గమనార్హం. ఇంద్ర చిత్రానికి 1.95 కోట్ల ఫుట్ ఫాల్స్ నమోదు అయితే RRR కి మాత్రం 1.85 కోట్ల ఫుట్ ఫాల్స్ వచ్చాయి. గత 25 ఏళ్లలో ఎన్ని వేల సినిమాలు వచ్చి ఉంటాయి. ఇటీవల విడుదలైన పుష్ప కూడా ఈ రికార్డును అధిగమించలేకపోయింది. ఎన్నెన్నో పాన్ ఇండియా సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఇంద్ర ఫుట్‌ఫాల్స్‌ను మించలేకపోయాయి.

megastar chiranjeevi euphoria in telugu states with record footfalls from 2000

ఇలాంటి ట్రెండ్ లో టాప్ 4 లో ఇంద్ర సినిమా నిలిచింది అంటే మెగాస్టార్ క్రేజ్ కి ఆ సినిమా విజయానికి ఇది అద్దం పడుతుంది అని చెప్పవచ్చు. మరి ఆ సమయం లోనే ఇంద్ర సినిమా సెట్ చేసిన్స్ కొన్ని సింగిల్ స్క్రీన్ రికార్డులు ఇప్పటికీ పలు చోట్ల ఉన్నాయి అంటారు. మరి ఆ రేంజ్ లో ఇంద్ర సినిమా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సెట్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు.

మరి మెగాస్టార్ సునామి ఈ ఒక్క సినిమాకే కాదు ఈ పాతికేళ్లలో "ఠాగూర్" ఇంకా "శంకర్ దాదా ఎంబీబీస్" లు కూడా టాప్ 10 లో నిలిచాయి. ఇలా టాప్ 10 సినిమాల్లో ఎలాంటి పాన్ ఇండియా మార్కెట్ లు లేకుండానే పూర్తిగా మెగాస్టార్ స్టామినాతో ఈ సినిమాలు చరిత్ర సృష్టించాయని చెప్పి తీరాలి. ఇలాంటి సత్తా ఉన్న చిరంజీవి తన రేంజ్ హిట్ కొట్టాలని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Read more about: chiranjeevi indra bahubali 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X