క్లిన్ కారాతో మెగాస్టార్ లండన్ టూర్.. చిరంజీవి వెకేషన్ వెనుక సీక్రెట్ తెలుసా?
తెలుగు చిత్ర సీమలో లెంజడరీ హీరో మెగస్టార్ చిరంజీవి అంటే ఓ బ్రాండ్. సిని పరిశ్రమకు పెద్ద దిక్కు. మెగస్టార్ వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు నిలబెట్టుకున్నాడు. యాక్టింగ్, డ్యాన్స్ లో చిరంజీవికి ఏ మాత్రం తగ్గకుండా చేస్తాడనడంలో ఏ మాత్రం సంశయం లేదు. రామ్ చరణ్-ఉపాసన కూతురు క్లిన్ కారా రాకతో మెగా ఫ్యామిలో కొండంత పండగ వచ్చినట్టైంది. గత నెలలో మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేశారు. ఈ మధ్య మెగా ఫ్యామిలీ లండన్ ట్రిప్ కు వెళ్లారు. మొదటిసారి వరల్డ్ టూర్ కు వెళ్లిన క్లిన్ కారా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు తండ్రీకొడుకులు.
విశ్వంభరతో మెగాస్టార్ చిరంజీవి, గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ సినిమాలతో బీజీగా ఉన్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి కాగా, చిరంజీవి విశ్వంభర దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ గ్యాప్ లో స్వీట్ ఫ్యామిలీతో కూల్ ట్రిప్ వేశారు మెగాస్టార్. చిరంజీవి తన కుటుంబంతో కలిసి విదేశాల్లో పర్యటిస్తున్న వార్త మీడియాలో వైరల్ అయింది.

మనుమరాలు క్లిన్ కారా, భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసనతో హైడె పార్కులో చిరంజీవి ఓ పిక్ ను షేర్ చేశారు. పిక్ వైరల్ అయింది. కాగా లండన్ వీధుల్లో ఫ్యామిలీతో స్టైలిష్ గా నడుచుకుంటూ వెళ్తున్న మరో పిక్ ను చిరంజీవి పోస్ట్ చేశారు. స్వీట్ ఫ్యామిలీతో బాస్ స్టైల్ చూసి ఫ్యాన్స్ ఆంనదంతో పరవశించిపోతున్నారు.
కేరీర్ లో రామ్ చరణ్ చూసి చిరంజీవి మురిసిపోతాడు. చిరు సినిమాలోని బంగారు కోడి పెట్ట.. సాంగ్ కు మగధీరలో చెర్రీ వేసిన స్టెప్పులకు ఇరగదీసావ్ రా బచ్చా.. అంటూ చిరంజీవితో చెప్పించారు. కానీ రియల్ లైఫ్ లో కూడా అంతే పుత్రోత్సాహంతో చిరంజీవి ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చి బీజీ కావడంతో కొంత గ్యాప్ వచ్చినా మళ్లీ ఊపుతో సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. రాజకీయాల్లోకి పోయి మళ్లీ రాడనుకున్నారేమో.. అదే గ్రేసు, అదే ఊపు అన్నట్టు యాక్టింగ్, డ్యాన్స్ ఇరగదీస్తున్నారు చిరు.
తక్కువ సినిమాలు చేసినా భారీ సినిమాలతో అనతి కాలంలోనే గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు రామ్ చరణ్. తన నటన, డ్యాన్స్, ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ డెలివరీతో విమర్శకుల ప్రశంసలు పొందుతున్నారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేసుకొని నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ గ్యాప్ లో ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. తల్లిదండ్రులు, భార్యతో కలిసి కూతురు ప్రిన్సెస్ క్లిన్ క్లారాతో ఫుల్ జోష్ లో లండన్ వీధుల్లో విహరిస్తున్నారు.
సినిమాలతో ఎప్పుడు బీజీగా ఉండే మెగా ఫ్యామిలీ ఇలాంటి ట్రిప్స్ తో నూతనోత్తేజం కలిగిస్తాయి. నెక్ట్స్ సినిమాలో ఫుల్ ఎనర్జీతో అభిమానులను అలరిస్తారు. చాలా రోజుల తర్వాత మెగా ఫ్యామిలీని ఇలా చూడటం అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. జులై 26 నుంచి ప్రారంభమయ్యే ఒలంపిక్స్ చూసేందుకు వెళ్తున్నట్టు చిరు చెప్పుకొచ్చారు. మొత్తానికి లండన్ టూర్ ను మెగా ఫ్యామిలీ హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











