సోషల్ మీడియాలో చిరు గ్రాండ్ ఎంట్రీ.. మొదటి ట్వీట్ ఏంటంటే..?
సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చాడు. ఉగాది పర్వదినాన సోషల్ మీడియాలోకి ప్రవేశించనున్నట్టు చిరు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకోవడానికి, ప్రజలందరితో తన ఆలోచనల గురించి తెలియపరచడానికి ఈ వేదికలోకి రాబోతోన్నట్టు ప్రకటించాడు.

అందరూ సోషల్ మీడియాలోనే..
సెలెబ్రిటీలందరికీ సోషల్ మీడియా ఖాతా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరికీ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, హలోలో ఏదో ఒక ఖాతా ఉండే ఉంటుంది. కొందరికి అన్నింట్టోనూ అకౌంట్స్ ఉంటాయి. గతేడాది కొత్తగా రామ్ చరణ్, ప్రభాస్ వంటివారు ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
తాజాగా చిరు గ్రాండ్ ఎంట్రీ..
అయితే తన తోటీ హీరోలందరికీ సోషల్ మీడియా ఖాతా ఉండటంతో చిరు కూడా ఈ దిశగా అడుగులు వేశాడు. ఇంత వరకు తాను చెప్పదలుచుకున్న విషయాలు, సందేశాలు మీడియాకు రిలీజ్ చేసేవాడు. ఇక నుంచి తన అధికారిక ఖాతాలోనే తెలుపనున్నట్టు కనిపిస్తోంది.

మొదటి ట్వీట్ ఏంటంటే..?
అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. నా తోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలంతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులందరితో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడగలగటం నాకెంతో ఆనందంగా ఉంది.
Recommended Video

ఇంట్లోనే ఉందాం..
ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మరాని కలికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం. ఇంటి పట్టునే ఉందాం.. సురక్షితంగా ఉందాం. అని ట్వీట్ చేశాడు. తెలుగు, ఆంగ్ల భాషలో ఈ సందేశాన్ని ట్వీట్ చేయడం విశేషం.


Click it and Unblock the Notifications











