twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    God Father First Look: అదిరిపోయే లుక్ లో మెగాస్టార్ ఎంట్రీ.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే!

    |

    మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న గాడ్ ఫాదర్ సినిమా అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఎప్పటినుంచి విడుదల చేయాలని అనుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా చిత్ర యూనిట్ ఒక గాడ్ ఫాదర్ రాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో క్లారిటీ ఇస్తూ మంచి హైప్ క్రియేట్ చేశారు. ఇక అనుకున్న సమయానికి నేడు గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు. ఇక ఫస్ట్ లుక్ లో మెగాస్టార్ ఎలా ఉన్నారు? అలాగే సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే వివరాల్లోకి వెళితే..

    అంచనాలు తగ్గలేదు

    అంచనాలు తగ్గలేదు

    మెగాస్టార్ చిరంజీవి ఈసారి ఎలాగైనా గాడ్ ఫాదర్ సినిమాతో సక్సెస్ అందుకుంటాడు అని అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఆచార్య సినిమాతో కొంత నిరాశ పరిచినప్పటికీ కూడా గాడ్ ఫాదర్ సినిమాపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి ఎందుకంటే ఈ పొలిటికల్ యాక్షన్ మూవీలో మెగాస్టార్ సరికొత్త లుక్ తో కనిపించబోతున్నాడు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

    సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్

    సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్

    ప్రముఖ తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ఇదివరకే పూర్తయింది. సల్మాన్ ఖాన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో కూడా చివరి దశకు చేరుకున్నాయి. అభిమానులు ఎప్పటి నుంచో ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసమే ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన ఆ టీజర్ మెగా అభిమానులను ఎంతగానో కట్టుకుంటుంది.

    ఫస్ట్ లుక్ రిలీజ్

    ఫస్ట్ లుక్ రిలీజ్

    అసెంబ్లీ ముందు ఒక పవర్ఫుల్ నాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి నల్లని కారులో ఎంట్రీ ఇవ్వడం అద్భుతంగా ఉంది. అంతేకాకుండా సునీల్ కూడా మెగాస్టార్ కారు డోర్ తీయడంతో నల్లని డ్రెస్ లో కనిపించడం చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సైలెంట్ గా కనిపిస్తూనే మెగాస్టార్ చాలా పవర్ఫుల్గా కూడా హైలెట్ అయ్యారు. విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ తో ఈ సినిమాలో సరికొత్త మెగాస్టార్ ను చూస్తామని ఫస్ట్ లుక్ తో ఒక క్లారిటీ వచ్చేసింది.

     థమన్ ఆదరగొట్టేశాడు

    థమన్ ఆదరగొట్టేశాడు

    ఇక ఫస్ట్ లుక్ టీజర్ లో మెగాస్టార్ లుక్ ఒక రేంజ్ లో ఉండగా దానికి తగ్గట్టుగా థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. తమన్ మొదటిసారి మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ అవకాశం కోసమే థమన్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాడు. ఇక సినిమాలో సాంగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతకుమించి అనేలా మెగా అభిమానులకు కిక్కిస్తాయి అని తెలుస్తుంది.

    విజయదశమికి రిలీజ్!

    విజయదశమికి రిలీజ్!

    ఇక ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారా అని ఓవర్గం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అసలైతే ఈపాటికే విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇవ్వాలని అనుకున్నారు. గత కొన్ని రోజులుగా అయితే ఈ సినిమా దసరా బరిలో రాబోతున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక అనుకున్నట్లుగా చిత్ర యూనిట్ కూడా విజయదశమి కి రాబోతున్నట్లు ఫస్ట్ లుక్ టీజర్ లోనే ఒక క్లారిటీ ఇచ్చింది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

    English summary
    Megastar chiranjeevi God Father First Look and release date details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X