Godfather Trailer: మెగాస్టార్ మాస్ ర్యాంపేజ్.. సల్మాన్ ఖాన్‌ యాక్షన్ డోస్ హైరేంజ్‌లో!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ బిగ్ బడ్జెట్ పొలిటికల్ యాక్షన్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అనంతపూర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. మెగాస్టార్ సరికొత్త స్టైల్ తో విజిల్ వేయించబోతున్నారు అని ఇదివరకే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు ట్రైలర్ తో అంచనాల స్థాయి మరో రేంజ్ జూ వెళ్ళిపోయింది. టీజర్ కంటే ఇప్పుడు ట్రైలర్ ఇంకా అద్భుతంగా ఉంది అని అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..

పూరి వాయిస్ ఓవర్ తో..

పూరి వాయిస్ ఓవర్ తో..

పూరి జగన్నాథ్ డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ లో జనజాగృతి అనే పొలిటికల్ పార్టీ పేరు హైలెట్ అయ్యింది. మంచోళ్ళందరు మంచోలు కాదని అంటూ చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక అని పూరి వాయిస్ ఓవర్ అద్భుతంగా ఉంది. ఇక సీఎం సీటులో కుర్చునేందుకు మెగాస్టార్ ఎంట్రీ కూడా అదిరిపోయింది.

బౌన్స్ బ్యాక్

బౌన్స్ బ్యాక్

మెగాస్టార్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో తనదైన శైలిలో మాస్ యాక్షన్ అంశాలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఆచార్య సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాతో మాత్రం అంతకుమించి అనేలా బౌన్స్ బ్యాక్ కాబోతున్నట్లు అర్థమవుతుంది. ఇదివరకే విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ట్రైలర్ కూడా అంతకుమించి అనేలా ఉంది.

అద్భుతమైన మేకింగ్

అద్భుతమైన మేకింగ్

థమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు మెగాస్టార్ యాక్షన్ సన్నివేశాలకు కరెక్ట్ గా సింక్ అయిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా సరికొత్త ట్విస్ట్ లతో అలరించబోతున్నట్లు తెలుస్తోంది. లూసిఫర్ రీమేక్ అయినప్పటికీ కూడా గాడ్ ఫాదర్ మాత్రం చాలా కొత్త సినిమా అనే తరహా లోనే అట్రాక్ట్ చేస్తోంది. దర్శకుడు మోహన్ రాజు మేకింగ్ విధానం కూడా అద్భుతంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ తో ఒక ఇంటి అయితే ఇచ్చేశారు.

పవర్ఫుల్ డైలాగ్స్

పవర్ఫుల్ డైలాగ్స్

మెగాస్టార్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పెద్దగా డ్యూయెట్ డ్యాన్స్ లేకపోయినప్పటికీ సల్మాన్ ఖాన్ తో చేయబోయే ఒకే ఒక స్పెషల్ సాంగ్ మాత్రం స్టెప్పులు వేయించకుండా ఉండదు అని తెలుస్తోంది. ఇప్పటికే లిరికల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్ గా యాక్షన్ డోస్ హైలెట్ అయ్యేలా విడుదల చేసిన మరో పాట కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది.

స్పెషల్ క్యారెక్టర్లు

మొత్తానికి ట్రైలర్ అయితే ఫ్యాన్స్ కు మంచి కిక్ అయితే ఇచ్చింది. ఎక్కడ కూడా తగ్గకుండా ఈ సినిమాను భారీ స్థాయిలోనే తెరపైకి తీసుకు వస్తున్నట్లు చూపించేశారు. ఇక వెండితెరపై ఫ్యాన్స్ చూసి పండగ చేసుకోవడమే అని అర్థమవుతుంది. సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో చేస్తున్న ప్రత్యేకమైన పాత్ర కూడా విజిల్ వేయించే విధంగా ఉంటుందని మరొకసారి క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ సినిమాలో నాయనతార మరొక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుండగా పూరి జగన్నాథ్ సత్యదేవ్ కూడా స్పెషల్ క్యారెక్టర్స్ తో మెప్పించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X