twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    GodFather సెన్సార్ రిపోర్ట్.. మెగాస్టార్ పొలిటికల్ యాక్షన్ ఎలా ఉందంటే?

    |

    మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసింది. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇప్పటికే విడుదలైన టీజర్ అలాగే సల్మాన్ ఖాన్ తో మెగాస్టార్ చేసిన సాంగ్ కూడా బాగా వైరల్ అయింది. తప్పకుండా ఈ సినిమా మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని కూడా అంచనాలు ఏర్పడుతున్నాయి.

    ఇక మొత్తంగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయినట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. గాడ్ ఫాదర్ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లుగా ప్రత్యేకంగా ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇక పోస్టర్లో మెగాస్టార్ చిరంజీవి మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్ గా కనిపిస్తున్నాడు. ఇక బ్లూ షర్ట్ తో పాటు పంచె కట్టులో కూడా మెగాస్టార్ కనిపించిన విధానం ఫాన్స్ కు ఎంతో కిక్ ఇస్తుంది.

    Megastar chiranjeevi godfather movie censor report and first talk

    ఒక చెస్ బోర్డులో ఆయన నడుస్తున్న విధానాన్ని బట్టి చూస్తూ ఉంటే సినిమాలో రాజకీయ ఎత్తులతో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించేలా ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఇక ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించినట్లుగా కూడా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి నటన ఈ సినిమాల్లో చాలా అద్భుతంగా ఉంటుందని ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఎంట్రీ మరో లెవెల్లో ఉంటుంది అని కూడా సెన్సార్ నుంచి టాక్ వచ్చింది.

    ఏదేమైనా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అని ముఖ్యంగా తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది అని కూడా టాక్ అయితే వినిపిస్తోంది. ఇక గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార మరొక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుండగా సత్యదేవ్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. ఇక మరి కొంతమంది ప్రముఖ నటీనటులు సునీల్ సముద్రఖని బ్రహ్మాజీ అలాగే దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు.

    English summary
    Megastar chiranjeevi godfather movie censor report and first talk
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X