GodFather: ఆసక్తిని కలిగిస్తున్న నయనతార స్పెషల్ లుక్.. ఎలాంటి పాత్రలో అంటే..

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో మళ్లీ ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని పవర్ ఫుల్ గా సిద్ధమవుతున్నారు. మలయాళం లో భారీ విజయాన్ని అందుకున్న లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా పై అంచనాలు అయితే గట్టుగానే ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా మెగా ఫాన్స్ ను ఎంతగానో అట్రాక్ట్ చేసింది. మొదటిసారి మెగాస్టార్ చిరంజీవి విభిన్నమైన మాస్ స్టైలిష్ పెప్పర్ లుక్కుతో కనిపిస్తున్నాడు.

అంతేకాకుండా పవర్ఫుల్ డైలాగ్స్ కూడా టీజర్ లో క్లిక్ కావడంతో ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. తెలుగు హిందీలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే చిత్ర యూనిట్ సభ్యులు నయనతార కు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. నయనతార ఈ సినిమాలో సత్యప్రియ జయదేవ్ అనే పాత్రలో నటించింది.

 Megastar chiranjeevi godfather movie Nayanathara first look viral

ఆమె చాలా ట్రెడిషనల్ గా సింపుల్ గా చీరలో టైప్ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ పోస్టర్ ఎంతో ఆసక్తిగా ఉంది. నయనతార ఈ సినిమాలో కూడా చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ కలయికలో వచ్చే పాట కూడా అద్భుతంగా ఉండబోతుంది అని ఫ్యాన్ చేత విజిల్ కూడా వేయిస్తుంది అని ఇదివరకే మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తూ ఉన్నాడు. ఇక మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రియాక్షన్ డ్రామా సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. మొదట దసరా బరిలో నుంచి ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది కానీ అందులో ఎలాంటి నిజం లేదని చిత్త యూనిట్ మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను అందుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X