God Father: చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫిక్స్.. వీడియో వైరల్
వరుసపెట్టి సినిమాలతో ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన తాజాగా నటించిన సినిమాల్లో గాడ్ ఫాదర్ ఒకటి. ఈ సినిమాపై మెగా అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్ లో తెరపైకి రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లతోపాటు టీజర్ తో అభిమానుల్లో పాజిటివ్ సైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం సిద్ధమైంది.

ఆకట్టుకున్న టీజర్..
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, ఫస్ట్ లుక్ లతోపాటు ఇటీవల విడుదలైన టీజర్ మెగా అభిమానులతోపాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో మెగా అభిమానుల్లో పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల కానున్నట్లు సమాచారం.

గ్రాండ్ గా ఈవెంట్..
ఇందుకోసం గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ ను మూవీ యూనిట్ భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం అనంతపురం వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం బస్టాండ్ పక్కన ఉన్న కాలేజ్ గ్రౌండ్స్ లో గాడ్ ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనుంది చిత్ర బృందం.

వీడియో వైరల్..
ఇందుకోసం సర్వం సిద్ధం చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను వదిలారు మూవీ యూనిట్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. గాడ్ ఫాదర్ టీజర్ ను మిక్స్ చేసి వదిలిన ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో గాడ్ ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్ అనంతపురంలోని ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ వేదిక కానున్నట్లు తెలుస్తోంది.

ఓటీటీ డీల్..
ఈ వేదికకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హాజరు కానున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి వస్తానని సల్మాన్ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా దాదాపు క్లోజ్ అయినట్లు సమాచారం.ఈ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించిన డీల్ కూడా క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ సినిమా రైట్స్ కోసం బాగానే పోటీ పడినట్లు సమాచారం.

భారీ ధరకు కొనుగోలు..
ముఖ్యంగా హాట్ స్టార్ కూడా ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకునెందుకు భారీ స్థాయిలో ఒక ఆఫర్ కూడా చేసినట్లు ఆమధ్య టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఊహించిన విధంగా మరో ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సినిమా హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. రైట్స్ ఎంత అమ్ముడుపోయాయి అనే విషయంలో క్లారిటీ రాలేదు కానీ మెగాస్టార్ కెరీర్లో లోనే ఈ సినిమా మంచి రేటుకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











