GodFather Trailer: 24 గంటల్లో జెట్ స్పీడ్ లో రికార్డును అందుకున్న మెగాస్టార్.. ట్రెండింగ్ లిస్ట్ లో నెంబర్ 1

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలోనే విడుదల చేయబోతున్నారు. మరొక ముఖ్యమైన పాత్రలో సల్మాన్ ఖాన్ నటించగా హిందీలో కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. తప్పకుండా అక్కడ కూడా సినిమా మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుంది అని బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు.

మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అయితే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక బుధవారం రోజు విడుదలైన ట్రైలర్ కూడా అంచనాల స్థాయిని ఒక్కసారిగా పెంచేసింది. ఇక సోషల్ మీడియాలో ట్రైలర్ విడుదలైన 24 గంటల తర్వాత ఒక సరికొత్త రికార్డును కూడా సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో అతివేగంగా 10 మిలియన్ వ్యూవ్స్ అందుకున్న సినిమాలలో గాడ్ ఫాదర్ ట్రైలర్ కూడా నిలిచింది. ఇక 24 గంటల్లో గాడ్ ఫాదర్ ట్రైలర్ 320k లైక్స్ అందుకోవడం విశేషం. ఇప్పటికీ కూడా యూట్యూబ్లో నెంబర్ వన్ ట్రెండింగ్ లిస్టులో కొనసాగుతోంది అంటే సరికొత్త రికార్డు అనే చెప్పాలి.

Megastar chiranjeevi godfather movie telugu trailer 24 hers record

తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక స్థాయిలో వ్యూవ్స్ సాధించిన ట్రైలర్లో ఒకటిగా ఇది నిలువబోతున్నట్లు అనిపిస్తోంది. ఇక లైక్స్ కూడా భారీ స్థాయిలోనే అందుకుంది. ఈ సినిమా ట్రైలర్ చాలా మంది ఆడియన్స్ ను మెప్పించింది. ఇక 24 గంటల్లో 320 లైక్స్ అందుకోవడం విశేషం. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అని సంకేతాలు కూడా అందుతున్నాయి.

మొత్తానికి సినిమాపై ట్రైలర్ అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పటికే ఒక సాంగ్ కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ట్రైలర్ కూడా చాలా బాగుంది అంటూ ఫ్యాన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార కూడా ఒక స్పెషల్ పాత్రలో నటించగా కమెడియన్ సునీల్ అలాగే సముద్రఖని, గెటప్ శ్రీను వంటి ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఇక చూస్తూ ఉంటే ఈ సినిమా మాత్రం దసరా ఫెస్టివల్ లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ సక్సెస్ గా నిలిచే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X