చిన్న చిత్రానికి చిరంజీవి చేయూత.. ఓ పిట్ట కథ కోసం పెద్ద మనసుతో కోసం..

ఫీల్‌గుడ్, చిన్న బడ్జెట్ సినిమాలను రూపొందించడంలో భవ్య క్రియేషన్స్ ప్రత్యేకమైన శైలి. ప్రస్తుతం కొత్త హీరో, హీరోయిన్లతో తెరకెక్కించిన చిత్రం ఓ పిట్ట కథ. టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతున్నాయి. బ్రహ్మజీ కుమారుడు సంజయ్ రావు ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. నిత్యశెట్టి, విశ్వాంత్ కీలక పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఇప్పటికే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొంటున్న ఓ పిట్ట కథను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు భవ్య క్రియేషన్స్ ప్లాన్ చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ మార్చి 1వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఇన్‌ఆర్బిట్ మాల్‌కు సమీపంలో ఐటీసీ కోహినూర్ హోటల్‌లో సాయంత్రం 6 గంటల నుంచి జరుగనున్నది.

Megastar Chiranjeevi gracing O Pitta Katha pre release event

ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ -''కథను నమ్మి తీసిన సినిమా ఇది. ఇప్పటికే మా ప్రచార చిత్రాలకు మంచి రెస్సాన్స్‌ లభిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా చాలా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేయనున్నాం. చిరంజీవి గారి రాకతో మా సినిమాకి ఓ కొత్త ఊపు రాబోతుంది. ఆయన ఈ ఫంక్షన్‌కి రావడానికి అంగీకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్‌'' అన్నారు.

నటీనటులు:
విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు

సాంకేతిక నిపుణులు:
పాటలు: శ్రీజో
ఆర్ట్: వివేక్‌ అన్నామలై
ఎడిటర్‌: డి వెంకటప్రభు
కెమెరా: సునీల్‌ కుమార్‌ యన్‌
సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అన్నే రవి
నిర్మాత: వి.ఆనంద ప్రసాద్‌
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం : చెందుముద్దు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X