వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' కోసం రాబోతున్న మరో స్టార్ హీరో..
సాయి ధరమ్ తేజ్ బ్రదర్ వైష్ణవ్ తేజ్, సుకుమార్ ప్రొడక్షన్ లో ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టేలా ఉన్నాడు. ఎప్పుడో సమ్మర్ లో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక మొత్తానికి ఫిబ్రవరి 12న గ్రాండ్ గా విడుదల కాబోతొంది. ఇక సినిమా ట్రైలర్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 24 గంటల్లో అత్యదిక లైక్స్ అందుకున్న టాప్ ట్రైలర్స్ లలో ఒకటిగా ఈ ట్రైలర్ నిలిచింది.
మొదట సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు గాని పోటీ ఎక్కువగా ఉండడంతో రిస్క్ చేయడానికి ఇష్టపడలేదు. ఇక ఉప్పెన సినిమాపై మొదటి నుంచి అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఆ సినిమాను ఇప్పటికే కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు చూసి ఈ యువ హీరో నటనపై పాజిటివ్ కామెంట్స్ చేశారట. ఫైనల్ గా సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకకు కూడా ఏర్పాట్లు మొదలయ్యాయి.శనివారం హైదరాబాద్ లో నిర్వహించనున్న వేడుక కోసం వచ్చే గెస్ట్ ఎవరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

మెగా హీరోల మొదటి సినిమాలన్నీ కూడా మెగాస్టార్ చిరంజీవి ద్వారానే ఆడియేన్స్ లోకి వెళతాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఫైనల్ గా ఉప్పెన ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర మెగా హీరోలు కూడా వస్తారని తెలుస్తోంది. చూడాలి మరి ఎవరెవరు వస్తారో. సుకుమార్ రైటింగ్స్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించేంచిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











