twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోడైరెక్ట‌ర్ బాధలు తెలుసుకొని చలించిన మెగాస్టార్.. కష్టాల్లో ఉన్న కుమార్తెకు అండగా చిరంజీవి!

    |

    మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై వెలిగే ఒక స్టార్ యాక్టర్ మాత్రమే కాదు. నిజజీవితంలో కూడా ఎంతోమందికి సహాయంగా నిలిచిన హీరో కూడా. ఆయన మంచి మనసును చూసే చాలామంది జనాలు ఆయనకు అభిమానులుగా మారారు. ఇప్పటికే కోవిడ్ కష్టాల్లో ఉన్న ఎంతోమందికి సహాయం చేసిన మెగాస్టార్ ఒక కో డైరెక్టర్ కష్టాల గురించి తెలుసుకొని అతని కూతురికి జీవితంలో మర్చిపోలేని కానుక ఇచ్చారు.

     ఎంతోమందిని ఆదుకున్నారు.

    ఎంతోమందిని ఆదుకున్నారు.

    క‌రోనా క్రైసిస్ లో సినీప‌రిశ్ర‌మలోని ఎంతమంది పేద కళాకారులు, కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక వారికోసం మెగాస్టార్ చిరంజీవి అండగా ఉండి ఆకలి తీర్చే ప్రయత్నం చేశాడు. ఎంతోమందిని ఆదుకున్నారు. ఆరోగ్య సమస్యలు అంటూ తన వద్దకు వచ్చిన అభిమానులకు కూడా ఆర్థిక సహాయం చేశాడు.

    డా.దాస‌రి నారాయ‌ణ‌రావు కోడైరెక్ట‌ర్..

    డా.దాస‌రి నారాయ‌ణ‌రావు కోడైరెక్ట‌ర్..


    ముఖ్యంగా ఆడబిడ్డలు ఆపదలో ఉన్నారని తెలిస్తే మెగాస్టార్ ఎలాంటి సహాయం చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటారు.
    ఇక ఇటీవల దర్శకరత్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు కోడైరెక్ట‌ర్ (లంకేశ్వ‌రుడు చిత్రానికి కో డైరెక్ట‌ర్) గా ప‌ని చేసిన వ్యక్తికి కష్టకాలంలో ఒక సోదరుడిగా నిలబడ్డాడు.

     మెగాస్టార్ తో మంచి అనుబంధం

    మెగాస్టార్ తో మంచి అనుబంధం

    దాస‌రి నారాయ‌ణ‌రావుతో మెగాస్టార్ కు మంచి అనుబంధం ఉంది. అలాగే ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కూడా మెగాస్టార్ కు ఆప్త మిత్రులే. దాస‌రితో ఎక్కువ కాలం ప్రయాణం చేసిన కో డైరెక్టట్ ప్ర‌భాక‌ర్ కూడా మెగాస్టార్ కు ఒకప్పుడు మంచి పరిచయమే. అయితే ఏళ్ళు గడిచినా కూడా మెగాస్టార్ అతన్ని మరచిపోలేదు.

    అండగా నిలిచిన మెగాస్టార్

    అండగా నిలిచిన మెగాస్టార్

    ఆప‌త్కాలంలో మెగాస్టార్ చిరంజీవి అతని గురించి తెలుసుకొని ట్ తన బృందం ఆర్థిక సాయం చేశారు. వారి కూతురు చ‌దువుకు అవ‌స‌ర‌మైన ఫీజుల సాయం చేసి అండగా నిలిచారు. ఈ విషయంపై స్పంధించిన ప్ర‌భాక‌ర్.. మెగాస్టార్ గొప్పతనం గురించి చెబుతూ ఎంతగానో ఎమోషనల్ అయ్యారు.

    చాలా నష్టపోవాల్సి వచ్చింది

    చాలా నష్టపోవాల్సి వచ్చింది


    నేను దాస‌రి వ‌ద్ద కోడైరెక్ట‌ర్ గా వర్క్ మెగాస్టార్ చిరంజీవి న‌టించిన లంకేశ్వ‌రుడి సినిమాకు కూడా ఆయనతోనే ఉన్నాను.
    రీసెంట్ గా హెల్ప్ లైన్ అనే సినిమా కూడా తీసాను. అయితే ఆ సినిమా కారణంగా నిర్మాతగా దర్శకుడిగా చాలా నష్టపోవాల్సి వచ్చింది. కనీసం ఎవ‌రూ రిలీజ్ చేయలేదు కూడా. ఇక మా అబ్బాయికి సీబీఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి రెండేళ్ల‌య్యింది. సర్టిఫికెట్లు రావాలి అంటే డబ్బు క‌ట్టి తేవాలి.

    ఫీజు కడితేనే పరీక్షలు రాయనిస్తారు

    ఫీజు కడితేనే పరీక్షలు రాయనిస్తారు


    ఇక పాప‌కు ఇటీవల బీబీఏ ఫైన‌ల్ ఇయ‌ర్ కి రాగా 2.5 ల‌క్ష‌ల ఫీజు అవసరం పడింది. ఫీజు కడితేనే పరీక్షలు రాయనిస్తారు. ఈ క్రమంలో డబ్బు కోసం చాలా ప్రయత్నం చేశాను కానీ ఎవరు సహాయం చేయలేము అన్నారు. ఎవ‌రిని అర్థించాలి అనుకున్నప్పుడు నా పిల్లల భవిష్యత్తు గురించి కూడా బాధపడ్డాను. నా ఇల్లు శ్మ‌శాన‌వాతావ‌ర‌ణంలా మారిందని రోధించను.

    చిరంజీవిగారు మాత్ర‌మే..

    చిరంజీవిగారు మాత్ర‌మే..

    ఇక చిరంజీవిగారు మాత్ర‌మే ఈ కష్టకాలంలో ఈ సాయం చేయ‌గ‌ల‌రని ప్రయత్నం చేశాను. 30ఏళ్ల క్రితం లంకేశ్వ‌రుడికి ప‌ని చేసిన‌ప్పుడు ఎంత ప్రేమ‌గా చూసుకున్నారో ఇప్పుడు కూడా అదే ప్రేమ‌ను చూపించారు. విషయం తెలుసుకొని వెంట‌నే ఫీజు కోసం ఏర్పాటు చేశారు. అయితే తగిన సమయంలో ఆ ఫీజును క‌ట్ట‌లేక‌పోవ‌డంతో హాల్ టికెట్ ఇవ్వ‌లేమ‌ని కూడా అన్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు సాయం చేశార‌ని అన‌గానే అక్క‌డ స్టాఫ్ అంతా సాయం చేశారు.

    Recommended Video

    Megastar Chiranjeevi, Vijayashanti బ్లాక్ బస్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ || Filmibeat Telugu
    దేవుడిలా కనిపించారు

    దేవుడిలా కనిపించారు


    చిరంజీవి గారు నాకు దేవుడిలా కనిపించారు. గ‌జేంద్ర మోక్షంలో మొస‌లికి చిక్కిన గ‌జేంద్రుని కాపాడేందుకు వ‌చ్చిన మ‌హా విష్ణువులా చిరంజీవి న‌న్ను కాపాడారు. రామ్ చరణ్ సిబ్బంది ద్వారా సహాయం అందుకున్నప్పుడు ఎంతో ఆనందంగా అనిపించింది. ఆయన మేలు అయితే జన్మలో మరచిపోలేను.. అని ఆ కో డైరెక్టర్ వివరణ ఇచ్చారు.

    English summary
    Everyone from PM Narendra Modi to all state CMs specially congratulated pv sindhu on winning the Silver and Bronze. Olympics twitter handle special response to megastar chiranjeevi tweet,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X